AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bheemla Nayak Trailer : పవర్ స్ట్రోమ్ వచ్చేసింది.. భీమ్లానాయక్ స్టామినా ఏంటో చెప్పేసిన ట్రైలర్

భీమ్లానాయక్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్ వాయిదా పడిందని ఫీలవుతున్న పవన్‌ డై హార్డ్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఈ మూవీ యూనిట్. ఈవెంట్ లేకుండా సూపర్‌ కిక్కిస్తామంటూ మాట ఇచ్చిన చిత్రయూనిట్..

Bheemla Nayak Trailer : పవర్ స్ట్రోమ్ వచ్చేసింది.. భీమ్లానాయక్ స్టామినా ఏంటో చెప్పేసిన ట్రైలర్
Bheemla Nayak
Rajeev Rayala
|

Updated on: Feb 21, 2022 | 9:03 PM

Share

Bheemla Nayak: భీమ్లానాయక్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్ వాయిదా పడిందని ఫీలవుతున్న పవన్‌ డై హార్డ్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్  ఇచ్చింది మూవీ యూనిట్. ఈవెంట్ లేకుండా సూపర్‌ కిక్కిస్తామంటూ మాట ఇచ్చిన చిత్రయూనిట్.. ఆ మాటను నిలబెట్టుకుంటూ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కొదిసేపటి క్రితమే భీమ్లా నాయక్ ట్రైలర్ విడుదల చేశారు. పవర్ స్ట్రోమ్ కు  రెడీగా ఉండాలని ముందే చెప్పిన చిత్రయూనిట్.. అదే రేంజ్ లో ట్రైలర్ ను కట్ చేసి ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించారు. భీమ్లానాయక్ వర్సెస్ డానియల్ శేఖర్… ఎవరికివారు అహం బ్రహ్మాస్మి అనుకుంటూ ఈగోల్ని కాపాడుకుంటూ సాగే కథను కనెక్టివిటీ కట్టవకుండా డిజైన్ చేశారు డైరెక్టర్ సాగర్‌కే చంద్ర. స్క్రీన్‌ప్లేలో త్రివిక్రమ్‌ ముద్ర క్లియర్‌గా కనిపిస్తోంది. 135 సెకన్ల ట్రైలర్  భీమ్లానాయక్ స్టామినా ఏంటన్నది చెప్పేసింది. ఈ ట్రైలర్ తో ఇప్పటివరకు ఉన్న రికార్డులు బద్దలవడం ఖాయం అంటున్నారు పవన్ ఫ్యాన్స్.

మలయాళ ఒరిజినల్‌ కంటే ఫిట్టుగా సెట్టయింది. అయితే ఇప్పుడు ఆగిపోయిన ప్రిరిలీజ్ ఈవెంట్ మళ్లీ ఎప్పుడు జరుగుతుంది… అసలు జరుగుతుందా లేదా అనే డైలమాక్కూడా ఫుల్‌స్టాప్ పెట్టేశారు నిర్మాతలు. భీమ్లానాయక్ సినిమా ఫ్రిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన ఈమూవీ పాటలు, పోస్టర్స్ , గ్లిమ్ప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వాయిదా పడిన ప్రీరిలీజ్ ఈవెంట్ ను రెండు రోజుల గ్యాప్ ఇచ్చి.. అదే వేదిక మీద అంతే గ్రాండ్‌గా ముందు చెప్పిన అతిథుల సమక్షంలోనే… ఈనెల 23న జరగబోతోంది భీమ్లా వేడుక.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas : ‘ప్రభాస్ నువ్ తెచ్చిన క్వాంటిటీతో ఆర్మీకి భోజనం పెట్టవచ్చు’.. డార్లింగ్ ఆతిథ్యం చూసి బిగ్ బి షాక్

గులాబీ పువ్వుల విరబూసిన ఆమ్నా షరీఫ్ అందాలు.. ఫోటోలు చుస్తే మతిపోవాల్సిందే.

తన అందాలతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్న బిగ్ బాస్ విన్నర్ తేజస్వి ప్రకాష్ లేటెస్ట్ ఫోటోస్.

Mahesh Babu: మరోసారి వెండితెరపై అలనాటి నటి.. మహేష్‏కు పిన్నిగా ఆ హీరోయిన్..

ఎండుద్రాక్షలో కూడా కల్తీ ఉంటుందా.? ఈ టిప్స్‎తో తెలుసుకోవడం ఈజీ..
ఎండుద్రాక్షలో కూడా కల్తీ ఉంటుందా.? ఈ టిప్స్‎తో తెలుసుకోవడం ఈజీ..
గ్లోబల్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు.. తొలిరోజే భారీ స్పందన
గ్లోబల్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు.. తొలిరోజే భారీ స్పందన
చింతకాయ పచ్చడి అంటే ఇష్టమా.? టేస్టీగా మీ కిచెన్‎లోనే సిద్ధం..
చింతకాయ పచ్చడి అంటే ఇష్టమా.? టేస్టీగా మీ కిచెన్‎లోనే సిద్ధం..
మేనేజర్ కుమార్తెకు మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన గిఫ్ట్.. వీడియో
మేనేజర్ కుమార్తెకు మెగాస్టార్ చిరంజీవి ఖరీదైన గిఫ్ట్.. వీడియో
దేశమే ముఖ్యం: ఆ బాధలోనూ గ్రౌండ్‌లో దిగిన స్మృతి మంధాన..!
దేశమే ముఖ్యం: ఆ బాధలోనూ గ్రౌండ్‌లో దిగిన స్మృతి మంధాన..!
అర్థరాత్రి ఇంటికెళ్తుండగా వెంటపడ్డ కుక్కలు.. కట్‌చేస్తే..
అర్థరాత్రి ఇంటికెళ్తుండగా వెంటపడ్డ కుక్కలు.. కట్‌చేస్తే..
ఢిల్లీ వెళ్తున్నారా.? ఆ హిల్ స్టేషన్స్ మిస్ కావద్దు..
ఢిల్లీ వెళ్తున్నారా.? ఆ హిల్ స్టేషన్స్ మిస్ కావద్దు..
కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
కిరాక్ మామ.. కిరాక్.. 10 సెకన్లలో పిల్లిని కనిపెడితే మీరు తోపులే
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
ఇండిగో సంక్షోభం.. ఎయిరిండియా నుంచి కీలక ప్రకటన
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారా..? ఇలా చేస్తే వెంటనే ఉపశమనం