AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fahadh Faasil: ఆ ఒక్క కారణంతో హాలీవుడ్ సినిమాను రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. ‘ఆస్కార్’ డైరెక్టర్‌ ఫోన్ చేసి మాట్లాడినా..

ప్రస్తుతం భారతీయ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ట్యాలెంటెడ్ నటుల్లో పుష్ప ఫేమ్ ఫహాద్‌ ఫాజిల్‌ ఒకరు. హీరోగా, విలన్ గా, సహాయక నటుడిగా.. ఇలా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతారాయన. అతని నటనకు పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ కారణంగానే ఓ ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు ఫహాద్‌ ఫాజిల్‌ ను పిలిచి తన సినిమాలో నటించమని ఆఫర్ ఇచ్చాడు. కానీ ఫహాద్‌ ఫాజిల్‌ నో చెప్పాడట.

Fahadh Faasil: ఆ ఒక్క కారణంతో హాలీవుడ్ సినిమాను రిజెక్ట్ చేసిన పుష్ప విలన్.. 'ఆస్కార్' డైరెక్టర్‌ ఫోన్ చేసి మాట్లాడినా..
Actor Fahadh Faasil
Basha Shek
|

Updated on: Aug 20, 2025 | 7:32 AM

Share

మలయాళ సినిమా ఇండస్ట్రీలో స్టార నటుడిగా కొనసాగుతున్నాడు ఫహాద్‌ ఫాజిల్‌. అయితేనేం ఈ నటుడికి పాన్ ఇండియా క్రేజ్ ఉంది. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్, కమెడియన్, సహాయక నటుడి పాత్రల్లో నటిస్తూ దేశ వ్యాప్తంగా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు.ఫహాద్‌ ఫాజిల్‌ క్రేజ్ ఏ స్థాయికి చేరిందో, ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్ డైరెక్టర్ తన సినిమాలో నటించమని ఫహద్‌ని కోరాడు, కానీ ఈ పుష్ప విలన్ మాత్రం నో చెప్పాడు. ‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియోకు తొలి ఆస్కార్‌ను తెచ్చిపెట్టిన ‘ది రెవెనెంట్’ చిత్రానికి తెరకెక్కించిన అలెజాండ్రో గొంజాలెజ్ ఇనారిటు తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. ‘బర్డ్‌మ్యాన్’, ‘ది రెవెనెంట్’ తో పాటు హాలీవుడ్ లో అద్భుతమైన చిత్రాలకు అలెజాండ్రో గొంజాలెజ్ ఇన్హార్టో దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన ఒక కొత్త సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఫహద్ ను ఒక పాత్రలో నటించమని అలెజాండ్రో అడిగారు. కానీ ఫహద్ ఫాసిల్ మాత్రం నో చెప్పాడు.

దర్శకుడు అలెజాండ్రో గొంజాలెజ్ ఇన్హార్టో స్వయంగా ఫహద్‌ను ఈ చిత్రంలో ఒక నిర్దిష్ట పాత్ర పోషించమని కోరారు. వారు వీడియో కాల్‌లో కూడా ఆ పాత్ర గురించి చర్చించారు. కానీ అన్ని చర్చల తర్వాత, ఫహద్ నో అన్నారు. దీని గురించి ఒక ఇంటర్వ్యూలో ఫహద్ ఫాసిల్ మాట్లాడుతూ, “మేము వీడియో కాల్‌లో మాట్లాడుకున్నాము. కానీ ఆ సినిమాలో నటించడానికి నా యాస సమస్యగా మారింది. దాన్ని సరిచేయడానికి శిక్షణ కోసం నేను న్యూయార్క్, అమెరికాలో నాలుగు నెలలు గడపవలసి ఉంటుందని వారు చెప్పారు. కానీ ఆ కాలానికి నాకు ఎటువంటి పారితోషికం ఇవ్వబోమని చెప్పారు. కాబట్టి నేను ఆ సినిమాలో నటించలేదు.మరొక విషయం ఏంటంటే, కమర్షియల్‌ కోణం నుంచి చూస్తే, ఆ పాత్రకు నేను సరిపోను. ఈ అవకాశం కోల్పోయినందుకు నేనేమీ బాధపడలేదు’’

‘ ఇలాంటి చర్చలు చాలా సినిమాలకు జరిగాయి. ఇలా సినిమా అవకాశాలను కోల్పోయిన సందర్భాలూ ఉన్నాయి. నా జీవితంలో మ్యాజిక్‌ ఏదైనా జరిగిందంటే అది మలయాళంలోనే. ఇక్కడ సాధించిన విజయాలు నాకెంతో సంతృప్తినిచ్చాయి. భవిష్యత్తులో సినిమా రంగంలో ఏమైనా మార్పులు వస్తే అది మలయాళం నుంచే రావాలని కోరుకుంటున్నాను. అందు కోసం కేరళను వదిలి వెళ్లకూడదనుకుంటున్నాను’ అని ఫహద్‌ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..