
సాధారణంగా సోషల్ మీడియా ప్రపంచంలో నటీనటులకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతున్న సంగతి తెలిసిందే. సినిమాలతోపాటు తారల పర్సనల్ విషయాలు సైతం నెట్టింట హాట్ టాపిక్ అవుతుంటాయి. ఇక సెలబ్రెటీల ఫ్యాషన్ నుంచి ఆటోమొబైల్ ప్రపంచం వరకు ప్రతి విషయం ఆసక్తిగానే ఉంటుంది. తాజాగా మలయాళీ హీరో ఫహద్ ఫాసిల్ కొత్త ఫెరారీ SUVను కొనుగోలు చేశారు. ఇటాలియన్ ఆటోమొబైల్ తయారీదారు ఫెరారీ ప్రారంభించిన మొదటి పెర్ఫార్మెన్స్ ఎస్‌యూవీ అయిన పురోసంజ్వాను కొనుగోలు చేశారు ఫహద్. కేరళలో ఈ వాహనాన్ని సొంతం చేసుకున్న మొదటి వ్యక్తిగా ఫహద్ ఫాసిల్ నిలిచాడు.
ఇవి కూడా చదవండి : Tollywood : అప్పుడు బ్యాన్ చేశారు.. ఇప్పుడు వరుస ఆఫర్స్.. ఈ సీరియల్ బ్యూటీ క్రేజ్ చూస్తే..
ఫెరారీకి చెందిన ఈ SUV మోడల్ ధర ఒకటి లేదా రెండు కోట్లు కాదు, 13.75 కోట్లు. తమిళ నటుడు విక్రమ్, ముఖేష్ అంబానీ ఈ కారును కొనుగోలు చేసిన ఇతర ప్రముఖులు. ఫహద్, నజ్రియాల వద్ద విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. ఈ సెలబ్రెటీ కపూల్ గ్యారేజీలో లంబోర్గిని ఉరుస్, మెర్సిడెస్-బెంజ్ G63 AMG, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, ల్యాండ్ రోవర్ డిఫెండర్, పోర్స్చే 911 కారెరా, టయోటా వెల్‌ఫైర్, మినీ కంట్రీమ్యాన్, వోక్స్‌వ్యాగన్ గోల్ఫ్ ఉన్నాయి.
ఇవి కూడా చదవండి : Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సేషన్.. ఇప్పుడు ఎన్టీఆర్ పక్కన ఛాన్స్.. తెలుగులో క్యూ కట్టిన ఆఫర్స్..
ఫహద్ తాజా చిత్రం ‘ఒడుం కుతిరా చదుం కుతిరా’ థియేటర్లలోకి వచ్చింది. ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అల్తాఫ్ సలీమ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో రేవతి పిళ్లై, వినయ్ ఫోర్ట్, లాల్, సురేష్ కృష్ణ, బాబు ఆంటోని, జానీ ఆంటోని, లక్ష్మీ గోపాలస్వామి, అనురాజ్, వినీత్ వాసుదేవన్ కీలకపాత్రలు పోషించగా.. జస్టిన్ వర్గీస్ సంగీతం అందించారు.
ఇవి కూడా చదవండి : Tollywood : అరె ఎంట్రా ఇది.. అప్పట్లో సెన్సేషన్ ఈ అమ్మడు.. ఇప్పుడు ఇలా.. ఎవరో గుర్తుపట్టారా.. ?
ఇవి కూడా చదవండి : OTT Movie: 25 కోట్ల బడ్జెట్.. ఆరేళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తున్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది..