Sir Movie: ‘సార్.. గొప్ప సందేశాన్ని అందించే సినిమా’. హీరో ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
స్టార్ యాక్టర్ ధనుష్ సరసన సంయుక్త మీనన్ జంటగా నటిస్తుండగా.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
తమిళ్ స్టార్ హీరో ధనుష్‌కు తెలుగులోనూ భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్ అయి సూపర్ హిట్ అందుకున్నాయి. కేవలం హీరోగానే కాకుండా సింగర్‌గానూ ధనుష్ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవలే తిరు చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్న ఆయన.. ఇప్పుడు నేరుగా తెలుగులో సార్ సినిమా చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన ద్విభాషా చిత్రం ‘సార్’ దీనిని ‘వాతి’ పేరుతో తమిళంలోనూ తీసుకురాబోతున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో స్టార్ యాక్టర్ ధనుష్ సరసన సంయుక్త మీనన్ జంటగా నటిస్తుండగా.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల కానుంది.
ధనుష్ నటించిన తొలి తెలుగు సినిమా కావడంతో ‘సార్'(వాతి)పై తమిళ్ తో పాటు తెలుగులోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా బుధవారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ.. సార్ సినిమా మీ అందరి కథ అన్నారు. తెలుగు ప్రేక్షకులు తనను ఆదరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
అందరికీ నమస్కారం అంటూ తెలుగులో స్పీచ్ చేసిన ధనుష్.. తెలుగులో చక్కగా మాట్లాడారు. అయితే మధ్యలో ఆయనకు త్రివిక్రమ్ సహాయకుడిగా ఉండి కొన్ని తెలుగు పదాలు మధ్య మధ్యలో అందించారు. “”2002లో నా మొదటి సినిమా రిలీజ్ అయ్యింది. అప్పుడు చాలా టెన్షన్ గా ఉంది. ఇప్పుడు 2023లో నా మొదటి తెలుగు సినిమా విడుదలవుతోంది. అప్పుడు ఇప్పుడూ.. ఒకే ఫీలింగ్. ఇది అద్భుతమైన ఎమోషన్స్, మెసేజ్ తో కూడిన సింపుల్ సినిమా. మేమొక అర్థవంతమైన సినిమా చేశాము. ప్రేక్షకులకు మాములుగా వాళ్ల కథలతో ఎక్కువగా కనెక్ట్ అవుతారు. ఇది మీ అందరి కథ. దర్శకుడు వెంకీ గారికి.. హీరోయిన్ సంయుక్త మీనన్, నిర్మాత వంశీ గారికి అందరికీ ధన్యవాదాలు. సాయి కుమార్ గారు ఇంటి నుంచి భోజనం తెప్పించేవారు.
త్రివిక్రమ్ గారు మొదటి నుంచి మాకిచ్చిన సపోర్ట్ కు ధన్యవాదాలు. యువరాజ్ గారు ప్రాజెక్ట్ కి పాజిటివ్ ఎనర్జీ తీసుకొచ్చారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందించకపోయినప్పటికీ ఈ వేడుకకు వచ్చి మాకు సపోర్ట్ చేసినందుకు బిగ్ థాంక్స్. అఖండ సినిమాలో నీ వర్క్ చాలా నచ్చింది .. సార్ సినిమా.. ఇది నా కథ కాదు.. మీ కథ. అందుకే మీకు నచ్చుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.