Ayesha Jhulka: నాలుగేళ్లుగా న్యాయ పోరాటం.. కుక్క కోసం కోర్టు మెట్లెక్కిన నటి
ఒకొక్క హీరోయిన్ ఒకటి రెండు కుక్కలను పెంచుకుంటున్నారు. అలాగే బాలీవుడ్ నటి ఆయేషా జుల్క దగ్గర కూడా కుక్కలు ఉన్నాయి. అయితే తాజాగా తన కుక్క విషయం లో అన్యాయం జరిగిందని ఏకంగా కోర్టుకెక్కింది. తన కుక్కను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారంటూ ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది
సెలబ్రెటీలు పెట్ డాగ్స్‌ను పెంచుకోవడం చాలా కామన్ విషయం.. చాలా మంది హీరోయిన్స్ సమయం దొరికితే తమ పెంపుడు కుక్కలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఒకొక్క హీరోయిన్ ఒకటి రెండు కుక్కలను పెంచుకుంటున్నారు. అలాగే బాలీవుడ్ నటి ఆయేషా జుల్క దగ్గర కూడా కుక్కలు ఉన్నాయి. అయితే తాజాగా తన కుక్క విషయంలో అన్యాయం జరిగిందని ఏకంగా కోర్టుకెక్కింది. తన కుక్కను అన్యాయంగా పొట్టనపెట్టుకున్నారంటూ ఏకంగా హైకోర్టు మెట్లెక్కింది ఆయేషా జుల్క. తనకు న్యాయం చేయాలనీ కోర్టును కోరింది. అసలు ఏం జరిగిందంటే..
ఆయేషా జుల్క.. పేరు చాలా మందికి తెలియకపోవచ్చు కానీ చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఈ అమ్మడు తెలుగు, కన్నడ భాషల్లో నటించింది. ఎక్కువగా సహాయక పాత్రల్లో నటించి మెప్పించింది ఈ చిన్నది. తెలుగులో జై, నేటి సిద్ధార్థ లాంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఈ అమ్మడు స్పీడు తగ్గించింది. అయితే ఆయేషా.. వీది కుక్కలను సంరక్షిస్తూ ఉంటుంది. చాలా కుక్కలను చేరదీసి వాటిని సంరక్షిస్తుంది.
కొన్ని కుక్కలను పెంచుకుంటుంది కూడా.. అయితే తనదగ్గర ఉన్న కుక్కల్లో రాఖి అనే కుక్క చనిపోయిందట.. దాని చావుకు కేర్ టేకర్ కారణం అని ఆమె ఆరోపించింది. ఆ కుక్క చనిపోయింది ఇప్పుడు కాదు 2020 సెప్టెంబరులో అది చనిపోయింది. 2021లో ఛార్జ్ షీట్ నమోదు చేసిన పోలీసులు ఆ కేర్ టేకర్ ను అరెస్ట్ చేశారు. ఆతర్వాత అతను బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే అప్పటి నుంచి ఆ కేసు అలానే ఉండిపోయింది. దాంతో తనకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించింది ఆయేషా.. బొంబే హైకోర్టు మెట్లెక్కిన ఆయేషా.. తనకు న్యాయం చెయ్యాలని కోరుతుంది. ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఆయేషా జుల్క ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
ఆయేషా జుల్క ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.