Arjun Sarja: ఘనంగా అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య సర్జా నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే

ఐశ్వర్య సర్జా తన బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోబోతుంది. ప్రముఖ తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య నిశ్చితార్థం జరిగింది. తంబి రామయ్య తమిళ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు అలాగే సహాయ నటుడిగాను సినిమాలు చేశారు. తంబి రామయ్య చాలా ఏళ్లుగా తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ఉమాపతి రామయ్య, ఐశ్వర్య సర్జా చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే.

Arjun Sarja: ఘనంగా అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య సర్జా నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే
Aishwarya Sarja
Follow us
Rajeev Rayala

|

Updated on: Oct 28, 2023 | 7:37 AM

అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య సర్జా నిశ్చితార్థం అక్టోబర్ 27 చెన్నైలో ఘనంగా జరిగింది. ధృవ సర్జాతో పాటు సర్జా కుటుంబ సభ్యులు ఘనంగా నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. ఐశ్వర్య సర్జా తన బాయ్‌ఫ్రెండ్‌ని పెళ్లి చేసుకోబోతుంది. ప్రముఖ తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్యతో ఐశ్వర్య నిశ్చితార్థం జరిగింది. తంబి రామయ్య తమిళ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు అలాగే సహాయ నటుడిగాను సినిమాలు చేశారు. తంబి రామయ్య చాలా ఏళ్లుగా తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. ఉమాపతి రామయ్య, ఐశ్వర్య సర్జా చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పెద్దల అంగీకారం తో పెళ్లికి సిద్ధమయ్యారు. తాజాగా వీరు తాజాగా కుటుంబ పెద్దల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.

అర్జున్ సర్జా కూతురు ఐశ్వర్య సర్జా 2013లో ‘పట్టట్టు యానై’ అనే తమిళ సినిమా ద్వారా నటిగా తెరంగేట్రం చేసింది. 2018లో ‘ప్రేమ బరా’ అనే కన్నడ సినిమా ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇదే సినిమా తమిళంలో ‘సొల్లివిడువా’గా విడుదలైంది. ఈ చిత్రానికి అర్జున్ సర్జా స్వయంగా దర్శకత్వం వహించి, నిర్మించారు. అయితే ఆ సినిమా తర్వాత ఐశ్వర్య ఏ సినిమాలోనూ నటించలేదు.

ఐశ్వర్య పెళ్లి చేసుకోబోతున్న ఉమాపతి రామయ్య కూడా సినీ నటుడే. 2017లో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఉమాపతి రామయ్య 2021 వరకు కేవలం నాలుగు సినిమాల్లోనే నటించారు. సర్వైవర్ తమిళ్ అనే రియాల్టీ షోలో కూడా పాల్గొన్నాడు.  ఐశ్వర్య, ఉమాపతి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి వేడుక కూడా చెన్నైలోనే జరిగే అవకాశం ఉంది. ఇక ఈ ఇద్దరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తలు  కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఇన్నాళ్లు సహించా.. ఇక నా విశ్వరూపం చూపిస్తా.! సాయి పల్లవి సీరియస్
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
ఈ సీన్ తిరుమలలో తప్ప ఇంకెక్కడా చూడలేరు.! వీడియో వైరల్..
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అమ్మవారి కోసం తపస్సు.. ప్రత్యక్షం కాకపోవడంతో ఎంతపని చేసాడంటే.!
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
అదిరిపోయే బెనిఫిట్స్‌.. జియో న్యూ ఇయర్ ప్లాన్‌.! వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
ఆకస్మిక మరణాలకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా.? వీడియో..
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
క్లాసులో ఇదేం పని మాస్టారు.! తిట్టిపోస్తున్న నెటిజన్లు.! వీడియో.
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
ఎప్పటికీ నువ్వే నా స్పూర్తి.! నేను ఎప్పటికీ మీ అభిమానినే అంటూ..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అందరూ ఇంటికి వచ్చారు సరే మరి NTR, చరణ్‌? | పెరుగుతున్న పుష్ప 2..
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
అది.. పవన్ రేంజ్.! గూగుల్ ట్రేండింగ్ లో పవన్ హవా.. బద్దలైన గూగుల్
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...
ఓరుగల్లు అబ్బాయి.. ఇటలీ అమ్మాయి స్టెప్స్ మీరు చూడాల్సిందే...