AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Ali : అలా చేసినందుకు క్షమించండి.. వివాదంపై స్పందించిన అలీ.. వీడియో రిలీజ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్య నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కమెడియన్ అలీ. దశాబ్దాలుగా ఎన్నో హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి నటుడిగా తనదైన ముద్ర వేశారు. తాజాగా ఆయన ఓ వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవల అలీ నటించిన ఓ యాడ్ పై ఓ వర్గం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందిస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు అలీ.

Actor Ali : అలా చేసినందుకు క్షమించండి.. వివాదంపై స్పందించిన అలీ.. వీడియో రిలీజ్..
Ali
Rajitha Chanti
|

Updated on: May 13, 2026 | 1:08 PM

Share

టాలీవుడ్ కమెడియన్ అలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో అనేక చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఆయన.. ఇప్పుడు ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల ఆయన చేసిన ఓ యాడ్ వై ఓ వర్గం ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సారీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇటీవల అలీ ఓ సబ్బుకు సంబంధించిన ప్రకటనలో నటించారు. అందులో సబ్బుకు లక్ష్మీ పూజా చేస్తూ కనిపించాడు. అలాగే బ్యాగ్రౌండ్ లో కొన్ని మంత్రాలు సైతం వినిపించాయి. ఇప్పుడు అసలు వివాదానికి దారి తీసింది. ఈ ప్రకటనపై ఓ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఓ వాణిజ్య ప్రకటన కోసం మత విశ్వాసాలను అపహాస్యం చేస్తారా అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..

దీంతో సోషల్ మీడియాలో అలీ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ వివాదంపై అలీ స్పందించారు. ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే క్షమించాలని కోరాడు. అంతేకాదు ఆ యాడ్ కూడా డిలీట్ చేశానని చెప్పారు. ముంబై కంపెనీ వాళ్లు యాడ్ చేయమన్నారని.. దేవుడు చేసిన మనుషులు సినిమాలో తనపై కంపోజ్ చేసిన చిన్న సీన్ ను ఈ యాడ్ కోసం వాడామని.. అయితే తన సన్నిహితులంతా యాడ్ ఇబ్బందిగా ఉందని చెప్పడంతో డిలీడ్ చేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అలీ రిలీజ్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..

సినీ ఇండస్ట్రీలో దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ప్రయాణం ఉన్న అలీ, ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ క్రమంలోనే ఈ యాడ్ వివాదాన్ని కూడా ఆయన హుందాగా ఎదుర్కొన్నారు. ప్రస్తుతం అలీ వరుస సినిమాలతో బిజీగా ఉండటమే కాకుండా, బుల్లితెరపై తన టాక్ షోల ద్వారా ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..

ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్‏గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..

Follow Us