Abbas: హీరో అబ్బాస్ ఏంటీ ఇలా మారిపోయారు..? రీఎంట్రీ ఇస్తున్నారా.. ? ఫోటోస్ వైరల్..

సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరో. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో అమ్మాయిల్ డ్రీమ్ బాయ్.. యూత్ కు తెగ ఇష్టమైన హీరో. కానీ తన క్రేజ్ కాపాడుకోవడం మాత్రం విఫలమయ్యారు అజిత్. ప్రస్తుతం సినిమాలకు దూరంగా విదేశాల్లో సెటిల్ అయ్యారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అబ్బాస్ న్యూలుక్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

Abbas: హీరో అబ్బాస్ ఏంటీ ఇలా మారిపోయారు..? రీఎంట్రీ ఇస్తున్నారా.. ? ఫోటోస్ వైరల్..
Abbas

Updated on: Jul 08, 2025 | 3:11 PM

అబ్బాస్.. ఈ తరానికి ఈ పేరు గురించి అంతగా తెలియదు.. కానీ 90’s యూత్ ఫేవరేట్ హీరో. ఒకప్పుడు కుర్రకారుకు ఇష్టమైన హీరో. అలాగే అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న లవర్ బాయ్. తొలి చిత్రంతోనే ప్రేమకథ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. 1996 లో విడుదలైన ప్రేమదేశం సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు అబ్బాస్. ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. మొదటి సినిమాతోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న అబ్బాస్.. ఆ తర్వాత తన సినిమాల విషయంలో చేసిన చిన్న చిన్న పొరపాట్లతోఇండస్ట్రీకి దూరమయ్యారు. టాప్ హీరోగా అప్పట్లో ట్రెండ్ సెట్ చేసిన అజిత్.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు ఎంపిక చేసుకోవడం.. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అజిత్ క్రేజ్ తగ్గిపోయింది.

ఇక ఆ తర్వాత అజిత్ నటించిన సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో నెమ్మదిగా ఈ హీరోకు అవకాశాలు తగ్గిపోయాయి. అబ్బాస్ ఇమేజ్ పూర్తిగా తగ్గిపోవడంతో ఆయనతో సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ముందుకు రాలేదు. 2009లో బ్యాంక్ సినిమాలో చివరిసారిగా కనిపించిన అబ్బాస్.. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. తెలుగు, తమిళం భాషలలో మొత్తం 50కి పైగా సినిమాల్లో నటించాడు.

సినిమాలు తగ్గిన తర్వాత యాడ్స్ ద్వారా బుల్లితెరపై సందడి చేశారు. ఆ తర్వాత అనుహ్యంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. సినిమాలు వదిలేసిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డారు అబ్బాస్. పెట్రోల్ బంక్ లో పనిచేయడం.. ఆ తర్వాత విదేశాలకు వెళ్లిపోయి మెకానిక్ గా వర్క్ చేశారు. ప్రస్తుతం న్యూజిలాండ్ లో ఐటీ జాబ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా అబ్బాస్ న్యూలుక్ ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో అబ్బాస్ లుక్ పూర్తిగా మారిపోవడంతో.. త్వరలోనే రీఎంట్రీ ఇస్తున్నారా ? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇవి కూడా చదవండి

Abbas New Look

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..