త్వరలో లక్కీ భాస్కర్2.. సీక్వెల్ పై హింట్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు టాలీవుడ్ లోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇటీవల ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాగే టాలీవుడ్ దర్శకులతో వరుసగా సినిమాలు చేస్తున్నాడు దుల్కర్. హనూ రాఘవపూడి తో సీతారామం లాంటి బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ మలయాళ హీరో.. ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకున్నాడు.
డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రానుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ మూవీ డైరెక్టర్ వెంకీ అట్లూరి… లక్కీ భాస్కర్ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అనుకున్నట్టుగా లక్కీ భాస్కర్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని ఫిక్స్ అయ్యాను.. సీక్వెల్ చేయాలని ప్రేక్షకుల నుంచి కూడా డిమాండ్ వస్తోంది అంటూ చెప్పాడు. కానీ దానికి కొంచెం టైమ్ పడుతుంది. లక్కీ భాస్కర్ సినిమా తర్వాత బయోపిక్ సినిమాలు చేయాలని కొంతమంది అన్నారు. కానీ వాటిని తెరకెక్కించాలని నాకు లేదు.. థ్రిల్లర్,పీరియాడిక్ చిత్రాలు చేయాలని కూడా లేదు. కుటుంబం మొత్తం కలిసి చూసే సినిమాలు చేస్తాను. అందుకు అనుగుణంగా ఇప్పుడు ఓ సినిమా చేస్తున్నా.. అని చెప్పుకొచ్చాడు. దీంతో ‘లక్కీ భాస్కర్’ సీక్వెల్ లక్కీ భాస్కర్2 ఉండనుందనే క్లారిటీ తెలగు ఫిల్మ్ లవర్స్‌కు వచ్చేసింది. అది కాస్తా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తోటి కూలీల మధ్య షష్టిపూర్తి.. ఆత్మీయతకు నిదర్శనం
కన్ఫర్మ్డ్ టికెట్లు ఉన్నా దొరకని బెర్తులు..
78 ఏళ్ల తర్వాత కలిసిన బాల్యమిత్రులు!
ఛీ.. ఛీ.. రైలు టాయిలెట్లో భోజన పాత్రలు కడిగిన IRCTC సిబ్బంది
24 గంటల్లో 47 వేల మొక్కలు.. గిన్నిస్ రికార్డు!
వీడెవడండీ బాబూ.. వెనుక రైలు వస్తున్నా నడుస్తూనే ఉన్నాడు!
ఏసీ రిపేర్‌కు వచ్చి.. ఆర్టిస్ట్‌కు సర్ప్రైజ్ ఇచ్చిన మెకానిక్స్!

