AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fahadh Faasil: తెలుగులోకి ఫహాద్ ఫాజిల్ ఆవేశం.. హీరోగా ఎవరు చేస్తున్నారంటే..

పుష్ప సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పుష్ప సినిమాలో తన నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. నెగెటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ దాన్ని హ్యాండిల్ చేసిన తీరుకు అభిమానులను ఆకట్టుకుంది. ఫహాద్ ఫాజిల్ తన కళ్లతో మొత్తం భావాలను వ్యక్తపరిచి ఆశ్చర్యపరిచాడు. ఇటీవలే మలయాళంలో ఆవేశం అనే సినిమా చేశాడు. 

Fahadh Faasil: తెలుగులోకి ఫహాద్ ఫాజిల్ ఆవేశం.. హీరోగా ఎవరు చేస్తున్నారంటే..
Aavesham
Rajeev Rayala
|

Updated on: Aug 06, 2024 | 10:35 AM

Share

నటుడు ఫహాద్ ఫాజిల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఆయనసుపరిచితుడే.. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం తదితర భాషల్లో విడుదలైన పుష్పలో విలన్‌గా నటించి భారతదేశంలో దృష్టిని ఆకర్షించాడు ఫహాద్ ఫాజిల్. తమిళంలో ఎల్లెక్కరన్, సూపర్ డీలక్స్, విక్రమ్, మమన్నన్ వంటి 4 చిత్రాల్లోనే నటించాడు. ఇక పుష్ప సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. పుష్ప సినిమాలో తన నటనతో అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు. నెగెటివ్ క్యారెక్టర్ అయినప్పటికీ దాన్ని హ్యాండిల్ చేసిన తీరుకు అభిమానులను ఆకట్టుకుంది. ఫహాద్ ఫాజిల్ తన కళ్లతో మొత్తం భావాలను వ్యక్తపరిచి ఆశ్చర్యపరిచాడు. ఇటీవలే మలయాళంలో ఆవేశం అనే సినిమా చేశాడు.

మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘ఆవేశం’ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఫహాద్ ఫాజిల్ నటించిన ‘ఆవేశం’ చిత్రం గత ఏప్రిల్‌లో థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రానికి జిత్తు మాధవన్ దర్శకత్వం వహించారు. మన్సూర్ అలీఖాన్, అసిస్ విద్యార్థి, సజిన్ గోబు, పూజా మోహన్‌రాజ్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. 2024 ఏడాదిలో  మలయాళ చిత్రాలు రికార్డ్ కలెక్షన్లను సృష్టిస్తున్నాయి. మంజుమ్మాల్ బాయ్స్, ప్రేమలు, ఆడు జీవితం కలిసి 100 కోట్ల కలెక్షన్స్ లిస్ట్‌లో చరిత్ర సృష్టించగా, ఆ క్రమంలో ఫహద్  నటించిన ఆవేశం కూడా బాక్సాఫీస్‌ని షేక్ చేసింది.

భ్రమయుగం, మంజుమ్మాల్ బాయ్స్, ప్రేమలు, ఆడు జీవితం ఇలా వరుసగా విడుదలైన మలయాళ సినిమాలన్నీ మలయాళ అభిమానులనే కాకుండా తెలుగు అభిమానులను కూడా ఆకట్టుకున్నాయి. మలయాళ సినిమాలు మంచి కథాంశాలతో విడుదలై విశేష స్పందనను అందుకుంటూ ప్రపంచ స్థాయిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటున్నాయి. ఆవేశం సినిమా హీరోయిన్ లేకుండా తెరకెక్కింది. అయినా కూడా ఈ మూవీ ‘ఆవేశం’ భారీ విజయం సాధించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది. బాలకృష్ణ ఆవేశం తెలుగు రీమేక్‌లో నటించనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. అయితే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది. ఈ సినిమా కథ తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూవీకి సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

View this post on Instagram

A post shared by Fahad Fasil (@fahad_nazrin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.