Dokka Seethamma: ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమా కలెక్షన్లన్నీ..

|

Mar 29, 2025 | 9:40 PM

తనకున్న వందల ఎకరాల భూమిని అమ్మేసి ఎంతోమంది ఆకలి తీర్చింది డొక్కా సీతమ్మ. కోట్లాది మందికి అన్నదానం చేసి ఆంధ్రుల అన్నపూర్ణ గా తెలుగు వారి గుండెల్లో చిర స్థాయిగా నిలిచిపోయింది. అలాంటి మహనీయురాలి జీవిత కథను ఇప్పుడు వెండి తెరపైకి తీసుకొస్తున్నారు.

Dokka Seethamma: ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మగా సీనియర్ హీరోయిన్.. సినిమా కలెక్షన్లన్నీ..
Dokka Seethamma
Follow us on

 

ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కుతోంది. టి.వి. రవి నారాయణ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఉషారాణి మూవీస్ బ్యానర్‌పై వల్లూరి రాంబాబు నిర్మిస్తున్నారు. కార్తిక్ కోడకండ్ల సంగీతం అందిస్తుండగా, రాహుల్ శ్రీవాస్తవ్
కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సపోర్టింగ్ రోల్స్ తో అలరిస్తోన్న ఆమని డొక్కా సీతమ్మ పాత్రలో ఆమని కనిపించనుంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో డొక్కా సీతమ్మలాగే కుర్చీలో కూర్చొని తెల్లచీరతో గుండుతో కనిపించింది ఆమని. దీంతో ఈ ఫస్ట్ లుక్ నెట్టింట వైరల్ గా మారింది. ఇటీవలే నారి అనే ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ అందాల తార ఇప్పుడు డొక్కా సీతమ్మ బయోపిక్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా డైరెక్టర్ టి.వి.రవి నారాయణ్ మాట్లాడుతూ డొక్కా సీతమ్మ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘ పవన్ కళ్యాణ్ అభిమానిగా ఒక మంచి పని చేయాలి అనుకునే నాకు డొక్కా సీతమ్మ గారి గురించి ఆయన చెప్పిన మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. దాంతో డొక్కా సీతమ్మ గారి చరిత్ర అందరికి తెలియాలని ఈ సినిమా తీస్తున్నాను. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి విరాళంగా ఇస్తాం. డొక్కా సీతమ్మ పేరు మీద ఉన్న పథకానికి ఆ డబ్బులు విరాళంగా ఇస్తాం. మొదటి సినిమానే డొక్కా సీతమ్మ లాంటి మహనీయురాలైన కథతో చేస్తుండటం నా అదృష్టం’ అని డైరెక్టర్ తెలిపారు తెలిపారు.

ఇక ఆమని మాట్లాడుతూ’ నేను బెంగళూరలోనే ఎక్కువగా ఉన్నాను. నాకు ఆమె గురించి ఎక్కువగా తెలీదు. డైరెక్టర్ కథ చెప్పాక గూగుల్‌లో ఆమె గురించి వెతికాను. ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి తెలిసాక ఈ పాత్ర చేయాలంటే రాసి పెట్టి ఉండాలి అని ఒప్పుకున్నాను’ అని తెలిపారు

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.