Nithiin- Aadhi Pinisetty: సారీ బ్రదర్.. హీరో నితిన్‌కు క్షమాపణలు చెప్పిన ఆది పినిశెట్టి.. ఏం జరిగిందంటే?
గత నెలోలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్దం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథా, కథనాలు, టేకింగ్ పరంగా ఈ సినిమా ప్రశంసలు అందుకుంది. ఇక టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ఇప్పుడు రాబిన్ హుడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ నటించిన తాజా చిత్రం రాబిన్ హుడ్. ఛలో, భీష్మ చిత్రాలను తెరకెక్కించిన వెంకీ కుడుముల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఎక్స్‌ట్రార్డీనరి మ్యాన్ తర్వాత నితిన్ తో మరోసారి జత కట్టింది శ్రీలీల. అలాగే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో క్యామియో రోల్ పోషించనున్నాడు. ఇక కేతిక శర్మ స్పెషల్ సాంగ్ లో సందడి చేసింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నితిన్ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పాడు మరో నటుడు ఆది పిని శెట్టి. అదే సమయంలో ఒక విషయంలో తనను క్షమించాలని నితిన్ ను కోరాడు. ఈ మేరకు ఆది పినిశెట్టి చేసిన ట్వీట్ ఇప్పుడు వైరలవుతోంది. గత నెలలో ఆది పినిశెట్టి హీరోగా నటించిన శబ్దం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంటెన్స్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో లక్ష్మీ మేనన్ హీరోయిన్ గా నటించింది. ఆకట్టుకునే కథా, కథనాలు, విజువల్స్, బీజీఎమ్ ఇలా శబ్దం సినిమాలో చాలా పాజిటివ్ అంశాలు ఉండడంతో ఆడియెన్స్ ను బాగానే మెప్పించింది. అయితే శబ్దం సినిమా రిలీజ్ టైమ్ లో నితిన్ ఒక ట్వీట్ చేశాడు. ఆది పినిశెట్టితో పాటు శబ్దం మూవీ యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.
అయితే తన సినిమా ప్రమోషన్ల లో బిజీగా ఉన్న ఆది పినిశెట్టి నితిన్ ట్వీట్ కు రిప్లై ఇవ్వలేకపోయాడట. ఈ క్రమంలోనే నితిన్ సినిమా రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఆది పినిశెట్టి ట్వీట్ పెట్టాడు. నితిన్ కు సారీ చెబుతూ రిప్లై ఇచ్చాడు. ‘ఇంత లేట్ అయినందుకు సారీ. అప్పుడు శబ్దం సినిమా రిలీజ్ టైమ్ లో ఇష్యూ ఉండడం వల్ల సరిగ్గా స్పందించలేకపోయాను. ఇంత లేటుగా రిప్లై ఇస్తున్నందుకు సారీ’ అని ట్వీట్ చేశాడు. అలాగే నితన్ రాబిన్ హుడ్ సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు ఆది పినిశెట్టి. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా నెట్టింట వైరలవుతోంది.
ఆది పినిశెట్టి ట్వీట్..
Brotherrrr…..thanks a lot for the tweet and iam extremely sorry for missing on replying to this….#Sabdham movie did not release on the first day in TN and I was zoned out trying to solve the issue!!! Wishing you a grand success for #Robinhood and iam sure its gonna be super… https://t.co/Yti8NxMhwS
— Aadhi🎭 (@AadhiOfficial) March 26, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.