70th Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం.. బెస్ట్ హీరోగా అల్లు అర్జున్, హీరోయిన్‌గా నివేదా థామస్‌

0వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. కేరళలోని కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల జరిగింది. 21న (శనివారం) రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఎంతో మంది స్టార్స్ పాల్గొన్నారు. తెలుగు, తమిళం,కన్నడ, మలయాళం భాషల్లో ఉత్తమ చిత్రాలకు అవార్డులు అందజేశారు.

70th Filmfare Awards: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం.. బెస్ట్ హీరోగా అల్లు అర్జున్, హీరోయిన్‌గా నివేదా థామస్‌
70th Filmfare Awards

Updated on: Feb 22, 2026 | 11:51 AM

70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. కేరళలోని కొచ్చి వేదికగా 70వ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డుల జరిగింది. 21న (శనివారం) రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో ఎంతో మంది స్టార్స్ పాల్గొన్నారు. తెలుగు భాషల్లో ఉత్తమ చిత్రాలకు, ఉత్తమ టెక్నీషయన్స్ కు అవార్డులు అందజేశారు. తెలుగు సినిమాలకు, నటీనటులకు, సాంకేతిక నిపుణులు అవార్డులు అందించారు. సౌత్ ఇండస్ట్రీకి సంబందించిన స్టార్స్ ఈవేడుకలో పాల్గొన్నారు. కాగా పుష్ప 2 సినిమాకిగానూ అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. అలాగే 35: చిన్నకథ కాదు చిత్రానికిగానూ హీరోయిన్ నివేదా థామస్‌ ఉత్తమ నటి అవార్డులు అందుకున్నారు. అలాగే అవార్డులను అందుకున్న మిగిలిన తెలుగు సినిమాలు ఏవో, అందుకుంది ఎవరో చూద్దాం..! ఆ లిస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి.

1. ఉత్తమ చిత్రం: పుష్ప 2

2. బెస్ట్ దర్శకుడు: సుకుమార్‌ (పుష్ప 2)

ఇవి కూడా చదవండి

3. బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ : యదు వంశీ (కమిటీ కుర్రోళ్లు)

4.  బెస్ట్ డెబ్యూ యాక్టర్ : సందీప్‌ సరోజ్‌ (కమిటీ కుర్రోళ్లు)

5. బెస్ట్ డెబ్యూ హీరోయిన్ : నయన్‌ సారిక (గం గం గణేశా)

6. బెస్ట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌: పుష్ప 2

7. ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)

8. ఉత్తమ సహాయ నటి: అంజలి (గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి)

9. ఉత్తమ సాహిత్యం: చుట్టమల్లె చుట్టేస్తోంది (దేవర), రచయిత: రామజోగయ్యశాస్త్రి

10. ఉత్తమ గాయకుడు: శ్రీకృష్ణ (కుర్చీ మడతపెట్టి: గుంటూరు కారం)

11. ఉత్తమ గాయని: శిల్పారావు (చుట్టమల్లె : దేవర)

12. బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌: నితిన్‌ జిహానీ (కల్కి 2898 ఏడీ), రామకృష్ణ- మోనిక (పుష్ప 2)

13. బెస్ట్‌ కొరియోగ్రఫీ: శేఖర్‌ మాస్టర్‌ (కుర్చీ మడతపెట్టి)

14. ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): లక్కీ భాస్కర్‌

15. ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): తేజ సజ్జా

16. ఉత్తమ నటి (క్రిటిక్స్‌): కాజల్‌ అగర్వాల్‌ (సత్యభామ)

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us