Sonia Agarwal: సినీమా ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం కలలం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సినిమా వాళ్ళను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ అయిన వారిలో బుజ్జిగాడు సినిమా హీరోయిన్ సంజన, అలాగే కన్నడ నటి రాగిణి ద్వివేది, అలాగే బాలీవుడ్ హీరోయిన్, సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ముగ్గురు బెయిల్ మీద బయటకు వచ్చారు కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి కన్నడ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం మరోసారి దుమారం రేపుతోంది. తాజాగా నటి, మోడల్ సోనియా అగర్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తనిఖీ చేయడానికి వెళ్లిన సమయంలో సోనియా అగర్వాల్ భయపడి బాత్రూంలో దాక్కుంది. ఆ తర్వాత ఆమె ఇంట్లో డ్రగ్స్ లభించడంతో.. అలాగే ఆమెను విచారించగా డ్రగ్స్ వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని ఒప్పుకోవడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆమెతో పాటు డీజే వచన్ చిన్నప్ప బిజినెస్ మ్యాన్ భరత్ ఇళ్లను సోదా చేశారు అధికారులు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారం పై కన్నడ మీడియా హడావిడి చేసింది. ఒక నటికి బదులు మరో హీరోయిన్ ఫోటోను వాడుతూ డ్రగ్స్ కుంభకోణంలో ఇరుక్కుందని వార్తలు ప్రసారం చేసింది.
మోడల్ సోనియా అగర్వాల్ బదులుగా హీరోయిన్ సోనియా అగర్వాల్ ఫోటోను వాడేశారు. హీరోయిన్ సోనియా అగర్వాల్ తెలుగు తమిళ్ భాషల్లో నటించింది. 7/జీ బృందావన్ కాలనీ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. అయితే కొన్ని వెబ్ సైట్స్ సోనియా అగర్వాల్ బదులు ఇలా హీరోయిన్ సోనియా అగర్వాల్ ఫోటోను వాడటంతో ఆ వార్త వైరల్ అయ్యింది. కొందరైతే నటి సోనియా అగర్వాల్ డ్రగ్స్ కుంభకోణంలో ఇరుక్కున్నట్టు రాసుకొచ్చారు. ఈ విషయం చివరకు సోనియా చెవిన పడటంతో ఆమె మీడియా పై సీరియస్ అయ్యింది. తన గురించి తప్పుగా రాసిన వెబ్ సైట్స్ జర్నలిస్టులపై చర్యలు తీసుకుంటానని పేర్కొంది. సరైన హోం వర్క్ చేయకుండా తన పరువుకు భంగం కలిగించారంటూ సోనియా అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేసింది.
మరిన్ని ఇక్కడ చదవండి :
భీమ్లా నాయక్ పుట్టినరోజుకు ముందుగానే పెద్ద ఎత్తున సందడి చేస్తున్న అభిమానులు..