AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బు కోసం చీప్ ట్రిక్స్..నిర్మాతపై రానా ఫైర్

రానా దగ్గుబాటి..హీరోగా కంటే నటుడిగా తనను తాను విభిన్న కోణాల్లో ఆవిష్కరించుకుంటున్నాడు. ఇటీవలే రానా హెల్త్ ఇష్యూస్ గురించి కొన్ని రూమర్స్ సర్కులేట్ అయ్యాయి. అయితే అవన్ని గాసిప్స్ అని తనకు ఏమైనా ఇబ్బంది ఉంటే..తానే చెప్తానని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే తాజాగా ఈ దగ్గుబాటి వారసుడు మరోసారి వార్తల్లో నిలిచాడు. రానా  కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘1945’. శివకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పుడోొ 3 ఏళ్ల క్రితం స్టార్టయిన ఈ మూవీలో రానా సైనికుడి పాత్రలో […]

డబ్బు కోసం చీప్ ట్రిక్స్..నిర్మాతపై రానా ఫైర్
Ram Naramaneni
|

Updated on: Oct 28, 2019 | 3:50 PM

Share

రానా దగ్గుబాటి..హీరోగా కంటే నటుడిగా తనను తాను విభిన్న కోణాల్లో ఆవిష్కరించుకుంటున్నాడు. ఇటీవలే రానా హెల్త్ ఇష్యూస్ గురించి కొన్ని రూమర్స్ సర్కులేట్ అయ్యాయి. అయితే అవన్ని గాసిప్స్ అని తనకు ఏమైనా ఇబ్బంది ఉంటే..తానే చెప్తానని క్లారిటీ ఇచ్చేశాడు. అయితే తాజాగా ఈ దగ్గుబాటి వారసుడు మరోసారి వార్తల్లో నిలిచాడు.

రానా  కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘1945’. శివకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఎప్పుడోొ 3 ఏళ్ల క్రితం స్టార్టయిన ఈ మూవీలో రానా సైనికుడి పాత్రలో కనిపించనున్న ఈ చిత్రాన్ని కొన్ని సంవత్సరాల క్రితం చిత్రబృందం ప్రకటించిందిటైటిల్ కి తగ్గట్టే ఇది ప్రీఇండిపెండెన్స్ కథతో తెరకెక్కుతోందని.. ఇందులో రానా ఐ.ఎన్.ఏ సైనికుడిగా కనిపించనున్నారని రూమర్స్ వినిపించాయి. రెజీనా ఈ చిత్రంలో కథానాయిక. కొంత చిత్రీకరణ జరిగాక ఏమైందో  సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అయితే అనూహ్యంగా దీపావళి సందర్భంగా ‘1945’ సినిమా ఫస్ట్‌లుక్‌ను ఆదివారం సోషల్‌మీడియా వేదికగా మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో రానా దగ్గుబాటి సినిమాను ఉద్దేశిస్తూ ఓ నెగటీవ్ పోస్ట్‌ పెట్టారు. ఇది ఒక అసంపూర్ణమైన చిత్రమని ఆయన విమర్శించారు.

‘సినిమాను నిర్మించే విషయంలో నిర్మాత విఫలమయ్యాడు. దాంతో ఈ సినిమా అసంపూర్ణంగానే ఉంది. సంవత్సరం నుంచి నేను వాళ్లను కలవలేదు. పోస్టర్‌ను విడుదల చేయడమనేది డబ్బులు సంపాదన కోసం చేసిన మోసపు ఆలోచనలా అనిపిస్తోంది. దయచేసి దీనిని ప్రోత్సహించకండి’ అని రానా పేర్కొన్నారు.

రానా ట్వీట్‌పై నిర్మాత రాజరాజన్‌ సోషల్‌మీడియా వేదికగా స్పందించారు. ‘సినిమా పూర్తయ్యిందా, లేదా అనేది దర్శకుడు నిర్ణయిస్తాడు. సినిమా పూర్తయ్యిందో.. లేదో ప్రేక్షకులను నిర్ణయించనివ్వండి. 60 రోజుల షూటింగ్‌ కోసం కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేశాను. అసంపూర్ణమైన చిత్రాన్ని ఎవరూ విడుదల చేయరు’ అని ఆయన తెలిపారు.