వరుసగా 15 డిజాస్టర్లు, పైగా జైలు జీవితం.. కట్ చేస్తే.. రీఎంట్రీలో రూ. 3 వేల కోట్లు.. ఆ హీరో ఎవరంటే

|

Oct 27, 2024 | 5:09 PM

ఈ హీరో జీవితమే ఓ ఇన్‌స్పిరేషన్.. కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు.. ఎత్తుపల్లాలు చూశాడు. వరుసగా 15 డిజాస్టర్ మూవీలు, ఆపై జైలు జీవితం.. అయినా స్ట్రాంగ్‌గా నిలబడి.. రీఎంట్రీ ఇచ్చాడు.. దాదాపుగా రూ. 3 వేల కోట్ల బిజినెస్..

వరుసగా 15 డిజాస్టర్లు, పైగా జైలు జీవితం.. కట్ చేస్తే.. రీఎంట్రీలో రూ. 3 వేల కోట్లు.. ఆ హీరో ఎవరంటే
Tollywood
Follow us on

సినీ ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడం అంటే అంత ఈజీ కాదు.. ఎన్నో ఏళ్లు కష్టపడాల్సి వస్తుంది. వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయాలి, ఎత్తుపల్లాలు దాటుకుని రావాలి. అప్పుడప్పుడూ సినీ నేపధ్యమున్నా.. సక్సెస్ సాధించడం చాలా కష్టం. ఇక పెద్ద పెద్ద స్టార్ హీరోల వారాసులైనా.. లేకపోతే బ్యాగ్రౌండ్ లేని స్టార్‌లు అయినా.. వరుసగా ఫ్లాప్స్ వస్తే ఇండస్ట్రీని వదిలేయాల్సిందే. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టార్ నటుడు ఆ కోవకు చెందినవాడే. వరుసగా 15 డిజాస్టర్లు వచ్చాయ్, ఆపై జైలు జీవితం.. ఇండస్ట్రీలో బ్యాన్.. ఇన్ని జరిగినా అతడు స్ట్రాంగ్‌గా ఉన్నాడు.. రీ-ఎంట్రీ ఇచ్చాడు.. సూపర్ స్టార్‌గా అవతరించడమే కాదు.. తిరుగులేని స్టార్ ఇమేజ్ సంపాదించాడు. ఇంతకీ అతడెవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్.

ఇది చదవండి: పురాతన తవ్వకాల్లో బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా.. అమ్మబాబోయ్.!

బాలీవుడ్‌లో బ్యాడ్‌బాయ్‌గా ముద్ర వేసుకున్న సంజయ్ దత్.. చైల్డ్ ఆర్టిస్టుగా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హీరోగా ‘రాఖీ’ అనే చిత్రంలో నటించాడు. తొలి చిత్రంతోనే మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇక ఆ వెంటనే పలు ఫ్లాప్స్ చవిచూసినా.. 1986లో ‘నామ్‌’ అనే సినిమాతో కంబ్యాక్ ఇచ్చాడు సంజయ్ దత్. అనంతరం 1993లో బాంబు పేలుడు కేసులో సంజయ్ హస్తం ఉందంటూ ఆరోపణలు రావడం.. అతడు జైలు పాలవ్వడం జరిగింది. బాలీవుడ్ సైతం సంజయ్ దత్‌ను బ్యాన్ చేసింది. ఆ సమయంలో డైరెక్టర్ విధు వినోద్ చోప్రా.. సంజయ్‌తో ఓ సినిమా అనౌన్స్ చేశాడు. అందులో హీరో షారుఖ్ కాగా.. హీరో ఫ్రెండ్ రోల్‌లో సంజయ్ కనిపించాలి. కానీ షారుఖ్ సినిమాను రిజెక్ట్ చేయడంతో.. హీరో ఆఫర్ సంజయ్ దత్‌ను వరించింది. ఇక ఆ సినిమా మరేదో కాదు.. మున్నాభాయ్ ఎంబిబిఎస్. సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. కానీ ఆ తర్వాత అనూహ్యంగా 2003 నుంచి 2006 వరకు సంజయ్ ఏకంగా 15 సినిమాలు ఫ్లాప్స్ చూశాడు. అయినా మళ్లీ లగే రహోమ్ మున్నాభాయ్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: అయ్యబాబోయ్.! ఏం అందం.. మజిలీ మూవీలో ఈ అమ్మడు గుర్తుందా..? ఇప్పుడు చూస్తే స్టన్

అనంతరం అగ్నిపథ్‌ సినిమాలో విలన్‌గా మెప్పించిన సంజయ్.. ఆపై కేజీఎఫ్ 2లో పవర్‌ఫుల్ విలన్ రోల్ చేశాడు. ఈ సినిమా ఏకంగా రూ.1200 కోట్లు రాబట్టింది. అనంతరం జవాన్ సినిమాలో క్యామియో.. లియో మూవీలో విలన్‌గా నటించాడు సంజయ్ దత్. ఇక ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర దాదాపుగా రూ.3 వేల కోట్ల వసూళ్లను రాబట్టాయి. ఇలా సంజయ్ దత్ తన కెరీర్‌లో ఎన్నో ఫెయిల్యూర్స్.. ఆపై అందుకోలేనంత ఎత్తుకు ఎదిగి.. అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచాడు.

ఇది చదవండి: దృశ్యం పాప అందాలతో అరాచకం.. ఇప్పుడు చూస్తే మతిపోవాల్సిందే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి