Tollywood: మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?

శుక్రవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తులంతా ఆలయాలకు పోటెత్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నారు. నిన్న తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలన్ని భక్తులతో కిటకిటలాడాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరోయిన్ ఒకరు మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

Tollywood: మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా..?
Actress
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 11, 2025 | 7:34 AM

ముక్కొటి ఏకాదశి సందర్భంగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జనవరి 10న వైకుంఠ ఏకాదశి కావడంతో తమకు సమీపంలోని ఆలయాలకు భగవంతుని దర్శనం కోసం జనాలు బారులు తీరారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ హీరోయిన్ తిరుమల తిరుపతి వెళ్లారు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి మెట్ల మార్గంలో కాలినడకకు కొండకు చేరుకున్నారు. అలాగే శ్రీవారి దర్శనం కోసం మోకాళ్లపై తిరుపతి కొండ మెట్లు ఎక్కారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు నందిని రాయ్.

విజయ్ దళపతి హీరోగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన వారసుడి సినిమాలో శ్రీకాంత్ ప్రేయసిగా కనిపించింది. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అంతకు ముందు నీలకంఠ దర్శకత్వం వహించిన మాయ సినిమాలో నటించింది. ఇందులో హీరోయిన్ గా కనిపించింది. అలాగే సుధీర్ బాబు సరసన మోసగాళ్లకు మోసగాడు సినిమాతోపాటు తెలుగులో మరికొన్ని చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ నందినికి అంతగా క్రేజ్ రాలేదు.

ఇవి కూడా చదవండి

కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. అటు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ బిజీగా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా మోకాళ్ల మెట్టలో మోకాళ్ల మీద మెట్లు ఎక్కుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు.

View this post on Instagram

A post shared by Nandini Rai (@nandini.rai)

View this post on Instagram

A post shared by Nandini Rai (@nandini.rai)

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..