AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: రూటు మార్చిన టాలీవుడ్‌ హీరోలు.. ఇప్పుడంతా అదే ట్రెండ్‌

మన సినిమాలకు, సముద్రానికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ బంధం మరింత ధృఢంగా మారుతుంది. ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోలు సీ బ్యాక్ డ్రాప్ కథల వైపు అడుగులేస్తున్నారు. ముఖ్యంగా రెండేళ్ల కింద ఉప్పెనతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చారు వైష్ణవ్ తేజ్. అలాగే ఈ మధ్యే వాల్తేరు వీరయ్యలోనూ చిరు ఫిషెర్ మ్యాన్‌గానే నటించారు. ఇదే కంటిన్యూ అవుతుందిప్పుడు. నాగ చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా రాబోతుంది...

Tollywood: రూటు మార్చిన టాలీవుడ్‌ హీరోలు.. ఇప్పుడంతా అదే ట్రెండ్‌
Tollywood Latest Trend
Narender Vaitla
|

Updated on: Aug 05, 2023 | 1:19 PM

Share

సముద్రం పిలుస్తుంది.. తీరప్రాంతాలు రా రమ్మంటూ ఆహ్వానిస్తున్నాయి.. టాలీవుడ్ కథల్లో అలలు ఎగిసిపడుతున్నాయి.. అలాంటి స్టోరీస్ వైపు మన హీరోల అడుగులు పడుతున్నాయి.. దర్శకులు కూడా ఎందుకో మరి అంతా సముద్రం వైపు చూస్తున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. చాలా మంది హీరోలు ఇప్పుడు సీ బ్యాక్‌డ్రాప్ కథల్లోనే నటిస్తున్నారు. తాజాగా చైతూ కూడా ఈ లిస్టులో చేరిపోయారు.

మన సినిమాలకు, సముద్రానికి విడదీయరాని అనుబంధం ఉంటుంది. ఇప్పుడు ఈ బంధం మరింత ధృఢంగా మారుతుంది. ఈ మధ్య చాలా మంది స్టార్ హీరోలు సీ బ్యాక్ డ్రాప్ కథల వైపు అడుగులేస్తున్నారు. ముఖ్యంగా రెండేళ్ల కింద ఉప్పెనతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చారు వైష్ణవ్ తేజ్. అలాగే ఈ మధ్యే వాల్తేరు వీరయ్యలోనూ చిరు ఫిషెర్ మ్యాన్‌గానే నటించారు. ఇదే కంటిన్యూ అవుతుందిప్పుడు. నాగ చైతన్య, చందూ మొండేటి కాంబినేషన్‌లో త్వరలోనే ఓ సినిమా రాబోతుంది. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియన్ బ్లాక్‌బస్టర్ తర్వాత చందూ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి.

ఈ సినిమా కథ అంతా సముద్రం చుట్టూనే తిరుగుతుంది. ఓ మత్స్యకారుడి జీవితం ఆధారంగా చందూ మొండేటి ఈ చిత్రం తెరకెక్కిస్తున్నారు. కథ కోసం తీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారుల జీవనశైలి గురించి తెలుసుకుంటున్నారు మూవీ టీం. సముద్రంలోకి వెళ్లినపుడు తుఫాన్ వస్తే ఏంటి పరిస్థితి.. కొన్నిసార్లు సరిహద్దులు దాటి వేరే దేశాల్లోకి వెళ్లినపుడు ఎలా బయటపడతారు.. ఇలాంటివన్నీ టీం ఆరా తీస్తున్నారు. 2018 తరహాలో సాగే సర్వైవల్ థ్రిల్లర్ ఇది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ప్రేమమ్, సవ్యసాచి తర్వాత చందూ, చైతూ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది.

ఇవి కూడా చదవండి

చైతూ మాత్రమే కాదు.. ఎన్టీఆర్ సైతం పూర్తిగా సముద్రం నేపథ్యంలోనే సినిమా చేస్తున్నారిప్పుడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర సినిమా అంతా కోస్టల్ ల్యాండ్స్, తీర ప్రాంతాల చుట్టూనే తిరుగుతుంది. దీనికోసం ప్రత్యేకంగా విఎఫ్ఎక్స్‌లో సముద్రాన్ని క్రియేట్ చేస్తున్నారు. చరణ్, బుచ్చిబాబు సినిమాకు సముద్రంతో లింక్ ఉంటుందని తెలుస్తుంది. మొత్తానికి మన కథలన్నీ సముద్రం చుట్టూ తిరుగుతున్నాయిప్పుడు. మరి కుర్ర హీరోలు నమ్ముకున్న సముద్రం వారి ఆశలను నిలబెడుతుందా.? లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. యంగ్ హీరో నాగ చైతన్య తన కెరీర్ లో తొలిసారి సముద్రం నేపథ్యంలో నటిస్తున్న సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ అంచనాలు ఏమేర అందుకుంటాడో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
ఆస్పత్రి నుంచి ట్రైనీ IPS ఉదయ్‌ కృష్ణ డిశ్చార్జ్..
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
నేడే ఫస్ట్ టీ20.. హరారే పిచ్ రిపోర్ట్, వాతావరణం ఎలా ఉందంటే?
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తల్లికి వందనం పథకంపై ఏపీ ప్రభుత్వం అప్డేట్.. డబ్బులు పడకపోతే..
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
తెలుగు రాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. నేడు భారీ వర్షాలు ఈ జిల్లాల్లో
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ టార్గెట్ చేసిన రికార్డులివే
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
ఇంజినీరింగ్ పూర్తి చేశారా?.. ప్రభుత్వ దిగ్గజం HPCLలో ఉద్యోగాలు
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
స్టార్ హీరో గ్యారేజ్‌లోకి కొత్త మహీంద్రాEV..మైండ్ బ్లోయింగ్ రేంజ్
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
'ధురంధర్' నటిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో వైరల్.. కారణమిదే
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
డేంజర్లో ఆ నలుగురు భారత ఆటగాళ్ల కెరీర్
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి
'చెన్నై లవ్ స్టోరీ' అనగానే నాకు ఆ జ్ఞాపకాలే గుర్తు కొచ్చాయి