Tollywood: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాని హీరోయిన్.. భీమిలి కబడ్డీ జట్టు నటి ఇంతలా మారిపోయిందేంటీ!
కొంతమందిని ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా మాయమయ్యారు. కానీ ప్రేక్షకుల మనసులో మాత్రం చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారు. అర్రే ఈ హీరోయిన్ ఇంకొన్ని సినిమాలు చేస్తే బాగుండు అని కుర్రాళ్లంతా అనుకునేలా చేశారు. అలాంటి భామల్లో శరణ్య మోహన్ ఒకరు. శరణ్య మోహన్ తమిళ్ నటి. ఆమె తమిళ్ లో పలు సినిమాలతో పాపులర్ అయ్యింది.

చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినా సందర్భాలు చాలా ఉన్నాయి. కొంతమందిని ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే కనిపించకుండా మాయమయ్యారు. కానీ ప్రేక్షకుల మనసులో మాత్రం చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారు. అర్రే ఈ హీరోయిన్ ఇంకొన్ని సినిమాలు చేస్తే బాగుండు అని కుర్రాళ్లంతా అనుకునేలా చేశారు. అలాంటి భామల్లో శరణ్య మోహన్ ఒకరు. శరణ్య మోహన్ తమిళ్ నటి. ఆమె తమిళ్ లో పలు సినిమాలతో పాపులర్ అయ్యింది. అలాగే తెలుగులో ఈ అమ్మడు నేచురల్ స్టార్ నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
భీమిలి కబడ్డీ జట్టు సినిమాలో అమాయకపు అమ్మాయిగా నటించి ఆకట్టుకుంది శరణ్య. ఈ సినిమాలో ఆమెకు డైలాగులు తక్కువేకాని తన కళ్ళతో అభినయం పలికించి ఆకట్టుకుంది శరణ్య. ఆతర్వాత పలు సినిమాలో నటించి మెప్పించింది. చూడచక్కని రూపం, ఆకట్టుకునే నటన ఉన్న ఈ చిన్నది తమిళ్ లోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఈ అమ్మడి తెలుగు, తమిళ్ తోపాటు మలయాళంలోనూ సినిమాలు చేసింది. అలాగే తెలుగులో విలేజ్ లో వినాయకుడు అనే సినిమాలో ఆమె నటన అందరిని ఆకట్టుకుంది. ఈ అమ్మడు దాదాపు 25 సినిమాల్లో నటించింది. చాలా సినిమాల్లో హీరో సిస్టర్ రోల్స్ నూ అలరించింది.
తెలుగులో కళ్యాణ్ రామ్ నటించిన కళ్యాణ్ రామ్ కత్తి సినిమాలో ఆయన చెల్లెలిగా నటించింది. 2014 తర్వాత ఆమె సినిమాలకు దూరం అయ్యారు. వివాహం చేసుకొని నటనకు గుడ్ బై చెప్పారు శరణ్య మోహన్. ప్రస్తుతం ఆమె తన భర్త, పిల్లల్తో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే కొంతమంది ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారు అని సోషల్ మీడియాలో.. అలాగే గూగుల్ లో గాలిస్తున్నారు
శరణ్య సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా ఉండరు. అప్పుడప్పుడు తన భర్త తో కలిసి వీడియోలు చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంది శరణ్య. అలాగే తన ఫ్యామిలీ ఫోటోలను కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది ఈ చిన్నది. ఇక ఇప్పుడు శరణ్య మోహన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఆమె లేటెస్ట్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె లేటేస్ట్ ఫొటోస్ పై మీరూ ఓ లుక్కేయండి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.