నేను క్రిస్టియన్.. నా కోడళ్ళు బ్రాహ్మిన్స్..! వాళ్లు పూజలు చేస్తుంటే నేను ఏం చేస్తానంటే
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నటుడు జీవ. విలన్ గా నటించి ప్రేక్షకులను విశేషంగా మెప్పించారు జీవ. కేవలం విలన్ గా మాత్రమే కాదు కమెడియన్ గానూ రాణించారు జీవ. అలాగే పలు సినిమాల్లో సహాయక పాత్రలు చేసి మెప్పించారు.

సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో జీవ ఒకరు. విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు జీవ. హీరోగా కెరీర్ మొదలు పెట్టిన జీవ, ఆతర్వాత విలన్ గా మారారు. అదేవిధంగా కొన్ని సినిమాల్లో కామెడీతోనూ నటించి ఆకట్టుకున్నారు జీవ. గతంలో ఓ ఇంటర్వ్యూలో జీవా తన సినీ ప్రస్థానం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వెయ్యికి పైగా చిత్రాలలో కమెడియన్ గా, సహాయక పాత్రలు, ముఖ్యంగా విలన్ గా భయపెట్టిన జీవా ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే ఏదైనా ఒక ప్రత్యేకమైన డ్రీమ్ రోల్ చేయాలని తాను ఎప్పుడూ కోరుకోనని జీవా స్పష్టం చేశారు. ఇంట్లో అమ్మ వండినదాన్ని తినడంలాగే, తనకు ఏ పాత్ర వస్తే అది ఆనందంగా స్వీకరిస్తానని, అసంతృప్తికి తావు ఇవ్వనని ఆయన అన్నారు. తన కళ్ళే చిత్ర పరిశ్రమలోకి రావడానికి కారణమని జీవా నొక్కి చెప్పారు. కె. బాలచందర్ గారు తన పంపిన ఫోటోలలోని కళ్ళను చూసి తనను పిలిపించి అవకాశం ఇచ్చారని, ఇది తనకు లభించిన అదృష్టమని ఆయన పేర్కొన్నారు.
విలన్ పాత్రలు చేసేటప్పుడు ప్రజలు భయపడటం, దగ్గరకు రాకపోవడం వంటి అనేక అనుభవాలు ఉన్నాయని జీవా గుర్తు చేసుకున్నారు. తనకు భయపడి రైలు ప్రయాణాల్లో పక్కన ఎవరూ రాకపోవడం ఒక విధంగా తనకు సుఖంగా ఉండేదని తెలిపారు. అయితే, వంశీ గారి దర్శకత్వంలో ఒక కామెడీ చిత్రం చేసిన తర్వాత, ప్రజల వైఖరి మారిందని, ఒక వృద్ధురాలు తనను ఆప్యాయంగా తలపై నిమిరిందని జీవా గుర్తు చేసుకున్నారు. ఒక సినిమా విజయాన్ని దర్శకులు, నిర్మాతలు లేదా నటులు ముందుగా అంచనా వేయలేరని, టికెట్ కొని సినిమా చూసే ప్రేక్షకులే దానికి తీర్పు చెప్పాలని జీవా అన్నారు.
జీవా తాను క్రిస్టియన్ అయినప్పటికీ, తన ఇద్దరు కోడళ్ళు బ్రాహ్మిన్స్ అని తెలిపారు. తమ ఇంట్లో అన్ని మతాల ఆచారాలు సమానంగా గౌరవిస్తామని అన్నారు. తన కోడలు పూజ చేసుకునేటప్పుడు తాను గౌరవిస్తానని తెలిపారు. తన స్నేహితులు కూడా హిందువులు, బ్రాహ్మిన్స్, చౌదరీలు, రెడ్లు, నాయుళ్ళు వంటి వివిధ సామాజిక వర్గాల నుండి ఉన్నారని, తనకు ఆ వ్యత్యాసం లేదని ఆయన స్పష్టం చేశారు. క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎక్కువగా ఉండే ప్రార్థనా సమయాలు, బిగ్గరగా మైకులతో చేసే ప్రార్థనలు తనకు నచ్చవని చెప్పారు. ప్రార్థన వ్యక్తిగతమని, ఇతరులకు అంతరాయం కలిగించకూడదని ఆయన గట్టిగా నమ్ముతా అని తెలిపారు జీవ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




