Titanic: టైటానిక్ కొత్త ముగింపు చూశారా..? ‘జీవితం ఒక్కటే అన్నిటికంటే విలువైంది’ అనే డైలాగ్ అదుర్స్..
Titanic Alternative Climax Video Goes Viral: ప్రపంచ సినిమా చరిత్రలో 'టైటానిక్' సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. భాష, దేశాలతో సంబంధం లేకుండా ఈ అపురూప ప్రేమ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు...
Titanic Alternative Climax Video Goes Viral: ప్రపంచ సినిమా చరిత్రలో ‘టైటానిక్’ సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. భాష, దేశాలతో సంబంధం లేకుండా ఈ అపురూప ప్రేమ కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అతి పెద్ద ఓడలో ప్రయాణం, ఈ సమయంలో ధనిక కుటుంబానికి చెందిన ఓ యువతికి, పేద కుటుంబానికి చెందిన ఓ కుర్రాడికి మధ్య పుట్టిన ప్రేమ ఎలాంటి మలుపులు తిరిగింది. చివరికి ఆ ప్రేమ ఎలా విషాదాంతమైందన్న నేపథ్యంలో వచ్చిన టైటానిక్ సంచలన విజయం సాధించింది. 1997లో విడుదలైన ఈ సినిమా ఏకంగా 11 ఆస్కార్ అవార్డులు గెలుచుకుందంటేనే ఈ సినిమాకు ప్రేక్షకులు ఏ స్థాయిలో బ్రహ్మరథం పట్టారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ ఓ అమూల్యమైన వజ్రంతో కూడిన చైన్‌ను ధరిస్తుంది. సినిమాలో ఓ సన్నివేశంలో హీరోయిన్ ఆ వజ్రాన్ని సముద్రంలోకి విసిరేస్తుంది. ఇది టైటానిక్ సినిమా చూసిన వారందరికీ తెలిసిందే. అయితే తాజాగా నెట్టింట్లో ఓ వీడియో తెగ వైరల్‌గా మారింది. టైటానిక్ సినిమాకు సరికొత్త క్లైమాక్స్‌గా ఉన్న వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో వయసు మళ్లిన పాత్రలో ఉన్న హీరోయిన్ వజ్రాన్ని ఓడలో ఉన్న ప్రయాణికులకు చూపిస్తుంది. ఆ ఓడలో ఉన్న ఓ కుర్రాడు హీరోయిన్ దగ్గరకి వచ్చి.. ‘ఒక్కసారి ఆ వజ్రాన్ని నా చేతికి అందిస్తావా.?’ అని అడుగుతాడు. దీంతో ఆ వజ్రాన్ని కుర్రాడి చేతికి అందిస్తూ.. ‘అన్నింటికంటే ముఖ్యమైంది, విలువైందీ జీవితమే. ప్రతీ రోజునూ ఆస్వాదించాలి’ అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ డైలాగ్ నెటిజెన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ డైలాగ్ చెప్పిన అనంతరం హీరోయిన్ ఆ వజ్రాన్ని సముద్రంలోకి విసిరేస్తుంది. దీంతో వజ్రం కంటే జీవితం గొప్ప అని ఈ సీన్‌తో చెప్పకనే చెప్పారన్నమాట. ఇక ఈ సన్నివేశం సినిమాలో ఉంటే మూవీ ఇంకా మంచి విజయాన్ని అందుకునేదని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ సరికొత్త క్లైమాక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి..
The alternate ending to Titanic is hilarious. This would have absolutely ruined the film for me pic.twitter.com/L3vSrSb72e
— Pat Brennan (@patbrennan88) February 16, 2021