Prabhas : ఇదెక్కడి క్రేజ్ మావ.. ప్రభాస్, త్రిష పేర్లతో ఏకంగా ఊర్లే ఉన్నాయి.. ఎక్కడో తెలుసా..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలకు ఉండే క్రేజ్ గురించి తెలిసిందే. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న డార్లింగ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు నాలుగు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది త్రిష. అయితే వీరిద్దరి పేర్ల మీద ఏకంగా ఊర్ల పేర్లు ఉన్నాయని మీకు తెలుసా.. ?

సాధారణంగా సినీ పరిశ్రమలో నటీనటులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ అభిమాన నటీనటుల సినిమాలు విడుదలవుతుంటే ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందే. పెద్ద పెద్ద కటౌట్స్, పాలాభిషేకాలతో రచ్చ చేస్తుంటారు. అలాగే తమ అభిమాన హీరో, హీరోయిన్లపై ప్రేమతో ఫ్యాన్స్ గుడులు కట్టడం, విగ్రహాలు ప్రతిష్టించడం కూడా మనం ఇప్పటివరకు చూశాం. కానీ అంతకుమించి.. ఏకంగా మన స్టార్స్ పేర్లతో ఊర్లే వెలిసాయనే విషయం మీకు తెలుసా? అవును, మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సౌత్ క్వీన్ త్రిషల పేర్లతో వేర్వేరు ప్రాంతాల్లో ఏకంగా గ్రామాలే ఉన్నాయి. ఆ ఊర్లు ఎక్కడున్నాయి? వాటి విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇందుకు సంబంధించిన బోర్డ్స్ నెట్టింట వైరలవుతున్నాయి. స్టార్స్ పేరు మీద ఊర్లు ఉండడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. ఆ తర్వాత వచ్చిన ‘సలార్’, ‘కల్కి 2898 AD’ వంటి చిత్రాలతో ఆయన గ్లోబల్ మార్కెట్‌ను శాసిస్తున్నారు. ప్రభాస్‌కు ఇండియాలోనే కాకుండా జపాన్, నేపాల్ వంటి ఇతర దేశాల్లోనూ భారీగా ఫ్యాన్ బేస్ ఉంది. ఈ క్రమంలోనే నేపాల్ దేశంలో ప్రభాస్ పేరు మీద ఓ ఊరు ఉన్నట్లు సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ ఊరి పేరు ఉన్న బోర్డు దగ్గర ఒక వ్యక్తి నిలబడి దిగిన ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా ప్రభాస్ పేరుతో ఒక గ్రామం ఉండటం చూసి డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
కేవలం ప్రభాస్ పేరుతోనే కాదు.. త్రిష పేరుతోనూ ఊరి పేరు ఉందంటే నమ్మగలరా.. కోలీవుడ్, టాలీవుడ్‌లలో దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‌గా రాణిస్తోంది త్రిష. 40 ప్లస్ వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తూ, ఒక్కో సినిమాకు రూ. 12 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూ మోస్ట్ బిజీయెస్ట్ యాక్ట్రెస్‌గా దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా, త్రిష పేరుతో ఓ విలేజ్ ఉన్న విషయాన్ని ఆమె అభిమానులు గుర్తించారు. లడఖ్‌లోని నూబ్రా లోయ (Nubra Valley) నుండి ప్రపంచంలోనే ఎత్తైన బేస్ క్యాంప్‌గా పిలవబడే సియాచిన్ బేస్ క్యాంప్‌కు వెళ్లే దారిలో ఈ ఊరు ఉంది. ఈ ఊరి పేరు ‘విజయాక్ త్రిష’ (Vijayak Trisha). ఒక అభిమాని ఆ ఊరి పేరున్న బోర్డు ముందు వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా తెగ వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
ప్రభాస్, త్రిష ఊర్ల పేర్లు..

Prabhas, Trisha Villages
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
