పంజాబీ భామ పూనం బజ్వా తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే. అందం, అభినయం పుష్కలంగా ఉన్నప్పటికీ, టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయింది.
'మొదటి సినిమా' (2005) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ క్యూట్ బ్యూటీ, ఆ వెంటనే కింగ్ నాగార్జున సరసన 'బాస్' చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది.
ఆ తర్వాత 'పరుగు', 'వేడుక' వంటి సినిమాల్లో అలరించినప్పటికీ ఇక్కడ లక్ కలిసిరాకపోవడంతో కోలీవుడ్, మాలీవుడ్ పరిశ్రమల వైపు అడుగులు వేసింది.
అక్కడ కొంతకాలం స్టార్ హీరోయిన్‌గా రాణించినా, ఆ సక్సెస్‌ను లాంగ్ రన్ కంటిన్యూ చేయలేకపోయింది. తర్వాత తెలుగులో మరోసారి నటించి మెప్పించింది ఈ అమ్మడు.
ప్రస్తుతం వెండితెరకు కాస్త దూరంగా ఉన్న ఈ 40 ప్లస్ సుందరి.. రీసెంట్‌గా డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. ఓటీటీలో కొత్త వెబ్ సిరీస్ చేస్తూ అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ.
సినిమా అవకాశాలు తగ్గినప్పటికీ, సోషల్ మీడియా ద్వారా పూనం బజ్వా నిత్యం తన ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్ చేస్తుంది.
తన పర్సనల్ లైఫ్ విశేషాలతో పాటు సరికొత్త గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. తాజాగా ఇన్ స్టాలో ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి
పూనం బ్రౌన్ కలర్ టీ-షర్ట్, బుల్లి నిక్కర్ (షార్ట్స్) ధరించి అల్ట్రా మోడ్రన్ లుక్‌లో దర్శనమిచ్చింది. చేతులు పైకెత్తి తన నాభి అందాలతో ఫోజులు ఇచ్చింది పూనం