అదరగొడుతోన్న ‘అల్లాద్దీన్’ ట్రైలర్
ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ మరో అద్భుతాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. 1992లో వచ్చిన యానిమేషన్ చిత్రం అల్లాద్దీన్‌ను ఇప్పుడు అదే పేరుతో నటీనటులతో రీమేక్ చేసింది. అదిరిపోయే విజువల్స్, సరికొత్త స్క్రీన్‌ప్లేతో రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. జీన్‌గా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ట్రైలర్‌కు ప్రధానాకర్షణగా నిలిచారు. చొక్కా కూడా సరిగా లేని అల్లాద్దీన్‌గా మీనా మసౌద్, అందం, అమాయకత్వం కలిసిన జాస్మిన్‌గా నయోమీ స్కాట్ కనిపించగా.. ఒరిజనల్ ఫీలింగ్‌ను పోగొట్టకుండా […]
ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ మరో అద్భుతాన్ని ప్రేక్షకులకు అందించేందుకు సిద్ధమైంది. 1992లో వచ్చిన యానిమేషన్ చిత్రం అల్లాద్దీన్‌ను ఇప్పుడు అదే పేరుతో నటీనటులతో రీమేక్ చేసింది. అదిరిపోయే విజువల్స్, సరికొత్త స్క్రీన్‌ప్లేతో రాబోతున్న ఈ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. జీన్‌గా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ ట్రైలర్‌కు ప్రధానాకర్షణగా నిలిచారు.
చొక్కా కూడా సరిగా లేని అల్లాద్దీన్‌గా మీనా మసౌద్, అందం, అమాయకత్వం కలిసిన జాస్మిన్‌గా నయోమీ స్కాట్ కనిపించగా.. ఒరిజనల్ ఫీలింగ్‌ను పోగొట్టకుండా దర్శకుడు గే రిట్చి ట్రైలర్‌ను తెరకెక్కించాడు. ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్లు అంతగా ఆకట్టుకోకపోయినా.. ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచేసింది . కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం మే 24న విడుదల కానుంది.