నాగార్జునకు ప్రధాని మోదీ ట్వీట్..!

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ఆ విధంగా ఓటర్లను చైతన్య పరచాలంటూ నాగార్జునకు మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా చాలామంది ఓటు హక్కు వినియోగంలో వెనకబడి ఉన్నారు. వారందరిలోనూ చైతన్య నింపి ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు వరస ట్వీట్స్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ.  ‘గత కొన్నాళ్లుగా సినిమాల ద్వారా చాలామంది […]

నాగార్జునకు ప్రధాని మోదీ ట్వీట్..!
Follow us
Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 13, 2019 | 3:16 PM

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జునకు ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని.. ఆ విధంగా ఓటర్లను చైతన్య పరచాలంటూ నాగార్జునకు మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా చాలామంది ఓటు హక్కు వినియోగంలో వెనకబడి ఉన్నారు. వారందరిలోనూ చైతన్య నింపి ఓటు హక్కు వినియోగించుకునేలా చేయాలని వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు వరస ట్వీట్స్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. 

‘గత కొన్నాళ్లుగా సినిమాల ద్వారా చాలామంది ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి.. వారి ఆదరాభిమానాలు సంపాదించారు. పలు అవార్డ్స్ సైతం సొంతం చేసుకున్నారు. ఎంతోమంది ఫాలోయింగ్ ఉన్న మీరు ఈ ఎన్నికల్లో ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైయ్యేలా ఓటర్లను చైతన్య పరచాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని ప్రధాని మోదీ నాగార్జునకు ట్వీట్ చేశారు.