14 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.. ఆనందంలో అనుష్క
గ్లామర్ అయినా, ధీరత్వమయినా అనుష్కకు వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి పాత్రనైనా సునాసాయంగా చేయగల స్వీటీ.. ఇటీవల తను ఇండస్ట్రీకి వచ్చి 14 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఆమె తన పాత రోజులను గుర్తు చేస్తుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. నాకు నేనుగా సినిమాల్లోకి రాలేదు. అలా కుదిరిపోయింది. మొదట పూరీ జగన్నాథ్ గారు సూపర్ సినిమాలో హీరోయిన్ కోసం చూస్తుంటే ఆయనకి తెలిసిన ఫ్రెండ్ నా గురించి చెప్పారంట. అప్పుడు పూరీ […]
గ్లామర్ అయినా, ధీరత్వమయినా అనుష్కకు వెన్నతో పెట్టిన విద్య. ఎలాంటి పాత్రనైనా సునాసాయంగా చేయగల స్వీటీ.. ఇటీవల తను ఇండస్ట్రీకి వచ్చి 14 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా ఆమె తన పాత రోజులను గుర్తు చేస్తుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేసింది. నాకు నేనుగా సినిమాల్లోకి రాలేదు. అలా కుదిరిపోయింది. మొదట పూరీ జగన్నాథ్ గారు సూపర్ సినిమాలో హీరోయిన్ కోసం చూస్తుంటే ఆయనకి తెలిసిన ఫ్రెండ్ నా గురించి చెప్పారంట. అప్పుడు పూరీ సర్ ఓకే అనడంతో హైదరాబాద్ కి వచ్చాను. అలా నాకు ఫస్ట్ ఛాన్స్ వచ్చిందని ఆమె అప్పట్లో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
సరిగ్గా.. కెమెరాని ఫేస్ చేసి నిన్నటితో 14 సంవత్సరాలు కావడంతో ఆ ఇంటర్వ్యూ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. కెమెరా ముందుకు వచ్చి 14 ఏళ్ళు అవుతుంది. నా కోసం ప్రత్యేక సమయం కేటాయించి నన్ను ఈ స్థానంలో నిలిపిన వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అంటూ తెలిపింది. నాగార్జున గారికి, పూరీ గారికి, నా అభిమానులు, నా కుటుంబం, స్నేహితులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అని పేర్కొంది.