రవితేజ రీమేక్‌కు టైటిల్ ఫిక్స్..?

వరుస సినిమాలతో మళ్లీ జోరు మీదున్నాడు మాస్‌రాజా రవితేజ. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’లో నటిస్తోన్న ఈ హీరో సంతోష్ శివన్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించబోతున్నాడు. తమిళ్‌లో విజయం సాధించిన ‘తెరి’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘కనకదుర్గ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్. కాగా ఈ మూవీని మొదట పవన్ కల్యాణ్ కోసం అనుకున్నారు […]

రవితేజ రీమేక్‌కు టైటిల్ ఫిక్స్..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Mar 13, 2019 | 12:29 PM

వరుస సినిమాలతో మళ్లీ జోరు మీదున్నాడు మాస్‌రాజా రవితేజ. వీఐ ఆనంద్ దర్శకత్వంలో ‘డిస్కో రాజా’లో నటిస్తోన్న ఈ హీరో సంతోష్ శివన్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించబోతున్నాడు. తమిళ్‌లో విజయం సాధించిన ‘తెరి’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రానికి ‘కనకదుర్గ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు టాక్.

కాగా ఈ మూవీని మొదట పవన్ కల్యాణ్ కోసం అనుకున్నారు మైత్రీ టీం. అందుకోసం పవన్‌కు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే ఉన్నట్లుండి పవన్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఈ ప్రాజెక్ట్ రవితేజకు వెళ్లింది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన కాజల్ జత కట్టనున్నట్లు తెలుస్తోంది.