Bheemla Nayak: భీమ్లానాయక్‌ వైల్డ్‌ ఫైర్‌.. ఆపడం చాలా కష్టం.. సినిమా సక్సెస్‌ మీట్‌లో థమన్‌..

Bheemla Nayak: పవన్‌ కల్యాణ్‌, దగ్గబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'భీమ్లానాయక్‌'. నిత్యామేనన్‌, సంయుక్తా మేనన్‌ హీరోయిన్లుగా నటించారు. సాగర్‌ కే. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించారు.

Bheemla Nayak: భీమ్లానాయక్‌ వైల్డ్‌ ఫైర్‌.. ఆపడం చాలా కష్టం.. సినిమా సక్సెస్‌ మీట్‌లో థమన్‌..
Thaman
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 27, 2022 | 8:55 AM

Bheemla Nayak: పవన్‌ కల్యాణ్‌, దగ్గబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లానాయక్‌’. నిత్యామేనన్‌, సంయుక్తా మేనన్‌ హీరోయిన్లుగా నటించారు. సాగర్‌ కే. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్‌ మాటలు, స్ర్కీన్‌ప్లే అందించారు. ఫిబ్రవరి 25న గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం మొదటి షో నుంచే బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సొంతం చేసుకుంది. ఈక్రమంలో చిత్రబృందం హైదరాబాద్‌ (Hyderabad) సక్సెస్‌ మీట్‌ ఏర్పాటుచేసింది. చిత్ర బృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొని సినిమాకు సంబంధించి తమ అనుభవాలను పంచుకున్నారు. ఇక ఈ సినిమాకు అదిరిపోయే బాణీలు, నేపథ్యం అందించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు థమన్‌ (Thaman). ఈ సందర్భంగా సక్సెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడుతూ ‘పవన్‌కల్యాణ్‌–త్రివిక్రమ్‌ గార్ల కాంబినేషన్‌లో పనిచేయాలని నాకు ఎప్పటి నుంచో కల. అది ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు. భీమ్లానాయక్‌’ పెద్ద తుపాను అవుతుందని మా అందరికీ తెలుసు. సినిమా విడుదలకు ముందు ఎన్నో కామెంట్లు విన్నాం. వాటికి సమాధానం చెప్పడానికి ఏడు నెలలుగా ఎంతో శ్రమించి ఈ నెల 25న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాం. మా సంకల్పం గొప్పది. అందుకే పెద్ద కమర్షియల్‌ హిట్‌ అయింది. భీమ్లానాయక్‌ ఓ మధురమైన ప్రయాణం. ఈ ప్రయాణం సాఫీగా సాగడానికి ఎంతో స్వేచ్చ, సహకారం అందించారు. ఈ సినిమాకి నేను పిల్లర్‌ అంటున్నారు. కానీ ఆ పిల్లర్‌ నిలబడటానికి సిమెంట్‌, సపోర్ట్‌ ఇచ్చింది ఆయనే. ఈ చిత్రం వైల్డ్‌ ఫైర్‌ లాంటిది. ఈ ఫైర్‌ని ఆపడం.. చాలా కష్టం’ అని చెప్పుకొచ్చారు.

నేనూ కేకలు, ఈలలు వేశాను..

ఇక ఈ సినిమాలో హీరోయన్‌గా నటించిన సంయుక్తా మీనన్‌ మాట్లాడుతూ ‘ఇది మా సినిమా అని చెప్పడం కంటే పవన్‌కల్యాణ్‌ సినిమా అంటేనే అందరి సినిమా అవుతుంది. ఇంతటి ఘన విజయంలో నేనూ భాగమైనందుకు ఆనందంగా ఉంది. నిన్న ఒక మాస్‌ థియేటర్‌లో ప్రేక్షకుల మధ్య సినిమా చూశా. ప్రతి సీన్‌కి నేను కూడా కేకలు, ఈలలు వేశా. తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి ఇంతకన్నా మంచి అవకాశం మరొకటి ఉండదని నమ్ముతున్నా’ అని చెప్పుకొచ్చింది.

Also Read:Bayyaram Steel Plant: తెలంగాణలో మరో ఉద్యమం.. తగ్గేదే లే అంటున్న రాష్ట్ర సర్కార్..

Andhra Pradesh: తెలుగుదేశంలో కొత్త చర్చ.. ఆ శపథమే కారణం.. ఇంతకీ ఏం నిర్ణయం తీసుకుంటారో..!

Telangana: అంతా ఒరిజినల్‌ అన్నారు.. ఢోకా లేనే లేదన్నారు.. చివరకు వారు చేసి పని ఇది..!