విజయ్.. పొలిటికల్ హీట్‌ను మరిపించేందుకేనా?

కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్‌ నటించిన మాస్టర్ సినిమా అప్‌డేట్‌ కోసం ఫ్యాన్‌ ఎప్పటి నుంచో వెయిట్‌ చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే పూర్తయిన ఈ చిత్రం

విజయ్.. పొలిటికల్ హీట్‌ను మరిపించేందుకేనా?
Follow us

|

Updated on: Nov 11, 2020 | 8:07 PM

Master Movie Teaser: కోలీవుడ్ స్టార్, దళపతి విజయ్‌ నటించిన మాస్టర్ సినిమా అప్‌డేట్‌ కోసం ఫ్యాన్‌ ఎప్పటి నుంచో వెయిట్‌ చేస్తున్నారు. చాలా రోజుల క్రితమే పూర్తయిన ఈ చిత్రం రిలీజ్ లాక్‌ డౌన్‌ కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్‌ ను విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. దీపావళి రోజు టీజర్‌ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు. అయితే సడన్‌గా టీజర్‌ రిలీజ్ అంశాన్ని తెర మీదకు తీసుకురావడం వెనుక పెద్ద ప్లాన్ ఉందన్న టాక్ వినిపిస్తోంది.

గత కొద్దిరోజులుగా విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీకి సంబంధించిన న్యూస్ తమిళనాట సంచలనం సృష్టిస్తోంది. ఆయన తండ్రి పొలిటికల్ పార్టీ ఎనౌన్స్ చేయటం, ఆ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదని విజయ్‌ ప్రకటన చేయటంతో ఈ వివాదం ఫ్యామిలీ ఫైట్‌గా మారిపోయింది. విజయ్‌కి తండ్రితో వివాదాలు ఉన్నాయన్న చర్చ తీవ్ర స్థాయిలో మొదలైంది. ఈ టైంలో టీజర్‌ వదిలితే… వివాదాన్ని పక్కన పెట్టి ఫ్యాన్స్‌ టీజర్‌ గురించి మాట్లాడుకుంటారని భావిస్తున్నారట మాస్టర్ టీం. అందుకే సడన్‌గా టీజర్‌ రిలీజ్ అంశాన్ని తెర మీదకు తెచ్చారు. ఖైదీ ఫేం లోకేష్‌ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు. బోల్డ్ బ్యూటీ మాళవిక మోహనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.