అక్కడేం పని డార్లింగ్..?
Prabhas Viral Pic: రాధే శ్యామ్ షూటింగ్ ముగించుకొని ఇండియా వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా ఛార్మీ పెట్‌తో కలిసి డార్లింగ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఛార్మీ స్వయంగా సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేయటంతో కొత్త చర్చ మొదలైంది. అసలు డార్లింగ్ అక్కడేం చేస్తున్నాడని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు. పూరి జగన్నాథ్‌తో ప్రభాస్‌కు మంచి రిలేషన్ ఉంది. పూరితో బుజ్జిగాడు, […]

Prabhas Viral Pic: రాధే శ్యామ్ షూటింగ్ ముగించుకొని ఇండియా వచ్చిన ప్రభాస్ ప్రస్తుతం ఫ్రెండ్స్‌తో కలిసి చిల్ అవుతున్నారు. తాజాగా ఛార్మీ పెట్‌తో కలిసి డార్లింగ్ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను ఛార్మీ స్వయంగా సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేయటంతో కొత్త చర్చ మొదలైంది. అసలు డార్లింగ్ అక్కడేం చేస్తున్నాడని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆరాలు తీస్తున్నారు.
పూరి జగన్నాథ్‌తో ప్రభాస్‌కు మంచి రిలేషన్ ఉంది. పూరితో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ వంటి సినిమాలను ప్రభాస్ చేశారు. ఆ సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ప్రభాస్ ఫేవరెట్స్ లిస్ట్‌లో స్థానం సంపాదించుకున్నాయి. అందుకే పూరి అంటే డార్లింగ్‌కు ప్రత్యేకమైన అభిమానం. ఆ రిలేషన్‌తో షూట్ గ్యాప్‌లో పూరిని ప్రభాస్ కలుస్తుంటారు.
తాజా ఫోటో కూడా ప్రభాస్… పూరి ఆఫీస్‌కు వెళ్లిన సందర్భంగా తీసిందేనన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు పూరిని… డార్లింగ్ ఊరికే కలిసారా..? లేక ఈ కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కబోతుందా అన్న చర్చ కూడా మొదలైంది. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్‌గా ప్రభాస్ సంచలనాలు సృష్టిస్తున్నారు. విజయ్ దేవరకొండతో తెరకెక్కిస్తున్న ఫైటర్‌తో పూరి కూడా పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేశారు. ఈ టైంలో పూరి, ప్రభాస్‌ల మీటింగ్ కొత్త రూమర్స్‌కు స్కోప్ ఇస్తోంది.