5

మెగాస్టార్ కోసం ఆ హీరోయిన్ ప్రత్యేక పూజలు…

మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా సోకిందని ఇటీవల ప్రకటించడంతో ఆయన అభిమానులు అందరూ కూడా 'మా మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు, పూజలు చేస్తున్నారు.

మెగాస్టార్ కోసం ఆ హీరోయిన్ ప్రత్యేక పూజలు...
Follow us

|

Updated on: Nov 11, 2020 | 6:46 PM

Prayers For Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తనకు కరోనా సోకిందని ఇటీవల ప్రకటించడంతో ఆయన అభిమానులు అందరూ కూడా ‘మా మెగాస్టార్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు, పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నటి నవీనా రెడ్డి కూడా తాజాగా దేవాలయంలో చిరంజీవి పేరు మీద అర్చనలు జరిపిస్తూ ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడుని వేడుకున్నారు.

”సినిమా ఇండస్ట్రీలో నాకు రోల్ మోడల్ అయిన మెగాస్టార్ చిరంజీవి గారు కరోనా బారిన పడటం ఎంతగానో కలచివేసింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా.. త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్నట్టు” నవీనా రెడ్డి పేర్కొన్నారు. కాగా, నవీనా రెడ్డి ”ఎఫ్ 2”, ”వెంకీ మామ”, ”భీష్మ”, ”ఉప్పెన” వంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక నవీనా రెడ్డితో పాటు యావత్ మెగాస్టార్ అభిమానులందరూ కూడా అయన అతి త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేస్తున్న విషయం తెలిసిందే.

Also Read: ఆ తప్పు మళ్లీ చేయనంటోన్న కీర్తి సురేష్..!