విజయ్ సినిమాకు అదిరిపోయే డీల్..!
తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ కోచ్ గా నటిస్తుండగా.. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ సన్ టీవీ భారీ ధరకు సొంతం చేసుకుందట. అంతేకాదు కోలీవుడ్ లో ఇప్పటివరకు ఇదే బిగ్ డీల్ అని వినికిడి. కాగా ఇంతకముందు వీరిద్దరి కాంబినేషన్ లో ‘తేరి’, ‘మెర్సల్’ […]

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రస్తుతం అట్లీ కుమార్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయ్ కోచ్ గా నటిస్తుండగా.. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ సన్ టీవీ భారీ ధరకు సొంతం చేసుకుందట. అంతేకాదు కోలీవుడ్ లో ఇప్పటివరకు ఇదే బిగ్ డీల్ అని వినికిడి.
కాగా ఇంతకముందు వీరిద్దరి కాంబినేషన్ లో ‘తేరి’, ‘మెర్సల్’ సినిమాలు విజయం సాధించడంతో ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా రిలీజ్ కానుంది.