ముద్దు కూడా నటనలో భాగమే- సమంత అక్కినేని

హైదరాబాద్‌:సమంతా రూత్ ప్రభు…ఇప్పుడు అక్కినేని సమంతగా మారిపోయింది. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళకుట్టి ఆ మూవీతో తెలుగు ఆడియెన్స్‌తో పాటు నాగ చైతన్యను కూడా మాయ చేసింది. పెళ్లికి ముందు పలు విజయవంతమైన సినిమాలలో కలిసి నటించిన ఈ జంట…పెళ్లి తర్వాత తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ మూవీలో చైతన్య సరసన సామ్‌తో పాటు దివ్యాంశా కౌశిక్‌ మరో హీరోయిన్‌గా నటించారు. సెన్సిబుల్ డైరక్టర్ శివ నిర్వాణ […]

  • Ram Naramaneni
  • Publish Date - 4:41 pm, Wed, 20 March 19
ముద్దు కూడా నటనలో భాగమే- సమంత అక్కినేని

హైదరాబాద్‌:సమంతా రూత్ ప్రభు…ఇప్పుడు అక్కినేని సమంతగా మారిపోయింది. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ కేరళకుట్టి ఆ మూవీతో తెలుగు ఆడియెన్స్‌తో పాటు నాగ చైతన్యను కూడా మాయ చేసింది. పెళ్లికి ముందు పలు విజయవంతమైన సినిమాలలో కలిసి నటించిన ఈ జంట…పెళ్లి తర్వాత తొలిసారిగా కలిసి నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ మూవీలో చైతన్య సరసన సామ్‌తో పాటు దివ్యాంశా కౌశిక్‌ మరో హీరోయిన్‌గా నటించారు. సెన్సిబుల్ డైరక్టర్ శివ నిర్వాణ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఏప్రిల్‌ 5న చిత్రం విడుదలకు సిద్ధమౌతోంది. ఇటీవల డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమాలో చైతన్య ప్రేయసిగా దివ్యాంశా, భార్యగా సమంత కనిపించనున్నారు.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన లభించింది. అందులో చైతన్య.. నటి దివ్యాంశాను ముద్దుపెట్టుకుంటూ కనిపించారు. ‘రంగస్థలం’ సినిమాలోనూ సమంత కథానాయకుడు రామ్‌చరణ్‌ను ఓ సన్నివేశంలో ముద్దుపెట్టుకున్నారు. అప్పట్లో అది వివాదస్పదంగా మారింది. ‘నేను కేవలం చరణ్‌ బుగ్గలపై ముద్దుపెట్టా, ఆ సీన్‌ సుకుమార్‌ కెమెరా ట్రిక్‌’ అని సామ్‌ క్లారిటీ అన్నారు.
‘మజిలీ’లో చైతన్య ముద్దు సన్నివేశం గురించి సామ్‌ రీసెంట్ ఇంటర్వూలో స్పందించారు. నటనలో ఇవన్నీ భాగమని ఆమె లైటర్ వే లో ఆన్సర్ ఇచ్చారు. ‘మా మధ్య అద్భుతమైన బంధం ఉంది, మేం మంచి స్నేహితులం, పెళ్లి కూడా చేసుకున్నాం.. ముందు ప్రజలు ఈ విషయం అర్థం చేసుకోవాలి. నటనకు, నిజానికి మధ్య చిన్న గీత ఉంటుంది. నా పరంగా ముద్దుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం కూడా నటనే. ఈ విషయాన్ని నేను అభిమానులకు కూడా చెప్పాలి అనుకున్నా. ఇదే రూల్‌ నాకు, చైతూకు వర్తిస్తుంది’ నెగటీవ్‌గా యాట్లాడేవాళ్లు కాస్త బిగ్గరగా థింక్ చేయండి అంటుంది సమంత. సో బీ అబ్డేట్ ప్యాన్స్.