Zee kutumbam awards: మొదలైన జీ కుటుంబం అవార్డుల సందడి.. మీ అభిమాన స్టార్స్‌కు ఇలా ఓటు వేయండి.

Zee kutumbam awards 2021: రకరకాల సీరియల్స్‌, ప్రోగ్రామ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ జీ తెలుగు...

Zee kutumbam awards: మొదలైన జీ కుటుంబం అవార్డుల సందడి.. మీ అభిమాన స్టార్స్‌కు ఇలా ఓటు వేయండి.
Zee Kutumbam Awards
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 15, 2021 | 7:38 PM

Zee kutumbam awards 2021: రకరకాల సీరియల్స్‌, ప్రోగ్రామ్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు ఆకట్టుకుంటోంది ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్‌ జీ తెలుగు. ఇక జీ చానల్‌లో వచ్చే సీరియల్స్‌లో నటించే వారందరినీ జీ కుటుంబంగా భావించి ప్రతీ ఏటా జీ తెలుగు కుటుంబం అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జీ తెలుగు సిద్ధమవుతోంది.

ఇది 11వ అవార్డుల వేడుక కావడం విశేషం. ఈ కార్యక్రమంలో భాగంగా సీరియల్స్‌లో నటించే నటీనటులకు అవార్డులను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఇక అవార్డు గ్రహీతలను ఎంచుకునే అవకాశం ప్రేక్షకులకు ఇచ్చింది జీ తెలుగు. ఇందులో భాగంగా తాజాగా నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభమైనట్లు అధికారిక ప్రకటన జారీ చేశారు. బుధవారం (సెప్టెంబర్‌ 15) మొదలైన ఈ ప్రక్రియ సెప్టెంబర్‌ 30 వరకు కొనసాగనుంది.

ప్రేక్షకులు తమకు నచ్చిన స్టార్స్‌కి ఓటు వేయాలంటే 57575 నెంబర్‌కు మెసేజ్‌ చేసి ఓటు వేయొచ్చు. లేదంటే జీ తెలుగు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఓటు వేసే అవకాశం కలిపించారు. వీటితో పాటు జీ5 యాప్‌/వెబ్‌సైట్‌లోకి లాగిన్‌ అయ్యి జీ కుటుంబం అవార్డ్స్‌ పోర్టల్‌ ద్వారా ఓటు వేయొచ్చు. నామినేషన్‌ల ప్రక్రియ ముగిసిన తర్వాత జీ కుటుంబం అవార్డు వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు.

Also Read: Pawan Kalyan: దారుణ హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి జనసేనాని ఓదార్పు

Rajamouli: మరో అద్భుతానికి తెర తీయనున్న జక్కన్న.. ఇండియన్‌ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం..?

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ ఫ్యాన్స్ నుంచి బెదిరింపు కాల్స్.. బిగ్‏బాస్ సరయు సంచలన వ్యాఖ్యలు