
మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 పూర్తికానుంది. సీజన్ 9 ఎవరు విన్నర్ అవుతారు అని ప్రేక్షుకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో తనూజ, కళ్యాణ్ అభిమానులు పోటీపడి పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఓటింగ్ లోనూ ఈ ఇద్దరే టాప్ లో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ అవ్వనున్నారు. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 మెంబర్స్ ఉన్నారు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన, డీమన్ పవన్ హౌస్ లో ఉన్నారు. వీరిలో ఒకరు విన్నర్ అవ్వనున్నారు. కాగా ప్రస్తుతం చివరివారం ఓటింగ్ జరుగుతుంది. ఈవారం ఓటింగ్ లో కళ్యాణ్ తనూజ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నారు. కాగా ఆతర్వాత ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ కొనసాగుతున్నారు.
ఈ గ్రాండ్ ఫినాలేలో ఊహించని ట్వీట్స్ లు జరిగే అవకాశం ఉంది. కాగా ప్రస్తుతం ఓటింగ్ లో చివరలో ఉంది సంజన.. అసలు సంజన ఎప్పుడో ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె ప్రతి నామినేషన్స్ లో సేవ్ అవుతూ వచ్చింది. ప్రస్తుతం టాప్ 5లో నిలిచింది. ఇక ఈ వారం జరిగే ఫినాలేలో ముందుగా ఈ అమ్మడే హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ముందుగా సంజనను హౌస్ నుంచి పంపనున్నారని అంటున్నారు నెటిజన్స్.. ఆతర్వాత ఎప్పటిలానే క్యాష్ బాక్స్ ను హౌస్ లోకి పంపించి డీమన్ పవన్ ను, ఆతర్వాత ఇమ్మాన్యుయేల్ ను టెంప్ట్ చేసి హౌస్ నుంచి బయటకు పంపిస్తారని భావిస్తున్నారు నెటిజన్స్. ఇక చివరిగా మిగిలిన కళ్యాణ్, తనుజను స్టేజ్ పైకి తీసుకొచ్చి ఇద్దరిలో ఒకరిని విన్నర్ గా అనౌన్స్ చేస్తారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఫైనల్ గా కళ్యాణ్ ను విన్నర్ ను చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..