Anchor Lasya: నాన్నకు ప్రేమతో.. తండ్రికి లగ్జరీ కారును కొనిచ్చిన యాంకర్ లాస్య.. ధర ఎంతో తెలుసా?
గతంలో తెలుగులో టాప్ మోస్ట్ యాంకర్ గా ఓ వెలుగు వెలిగింది లాస్య. అయితే ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోందీ అందాల తార. అదే సమయంలో యూట్యూబ్ వీడియోలు చేస్తూ బాగానే సంపాదిస్తోంది. అలా కొద్ది కొద్దిగా దాచుకున్న డబ్బుతో తన తండ్రికి ఓ లగ్జరీ కారును కొనిచ్చింది లాస్య.

ఇటీవల ఫాదర్స్ డేను పురస్కరించుకుని అందరూ తమ తండ్రులకు విషెస్ చెప్పారు. మరికొందరు తమ నాన్నలకు బహుమతులు అందించారు. సామాన్యులతో పాటు పలువురు ప్రముఖులు కూడా ఫాదర్స్ డే ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖ యాంకర్ లాస్య కూడా ఫాదర్స్ డే ను పురస్కరించుకుని నాన్న కలను నిజం చేసింది. ఈ శుభ సందర్భాన తన తండ్రికి ఓ లగ్జరీ కారుని బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని లాస్యనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. నాన్నకు కారు కొనివ్వడానికి గల కారణాన్ని కూడా అందులో చెప్పుకొచ్చింది. ‘నాన్నా, ఎంత కష్టపడ్డావో, ఎన్ని త్యాగాలు చేశావో నాకు బాగా తెలుసు. U deserve this Naana , ఈ car నీకు chala help avuthundi.. నా కల నెరవేరింది – మా నాన్నకి కారు కొని ఇవ్వడం. నీ హెల్త్ జాగ్రత్త నాన్నా. ప్రేమతో మీ చిన్న కూతురు’ అంటూ కారుతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేసింది లాస్య. ‘చిన్నప్పటి నుంచి నాన్న కారుతో తిరిగితే చూడాలనేది నా ఆశ. పెళ్లి తర్వాత నేను కొన్న మొదటి కారుకి ఆయనే ఈఎంఐ చెల్లించారు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉండటంతో నాన్నకు కారు కొనిస్తున్నాను’ అని తన యూట్యూబ్ వీడియోలో చెప్పుకొచ్చింది లాస్య. ఈ ఫొటోలు, వీడియోల్లో లాస్య తల్లిదండ్రులతో పాటు ఆమె భర్త, పిల్లలను కూడా చూడొచ్చు.
గతంలో పలు టీవీ షోలకు యాంకర్ గా చేసి మెప్పించింది లాస్య. ఆపై బిగ్‌బాస్ 4వ సీజన్‌లోనూ పాల్గొంది. విజేతగా నిలవకపోయినా తన ఆట, మాట తీరుతో అందరి మనసులు గెల్చుకుంది. ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉంటోన్న ఈ అందాల తార సొంతంగా యూట్యూబ్ ఛానెల్ ను నిర్వహిస్తోంది. అందులో వీడియోలు చేస్తూ బాగానే సంపాదిస్తోంది. అలా కొద్దికొద్దిగా దాచుకున్న డబ్బుతో తాజాగా ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రికి టాటా ఆల్ట్రోజ్ కారుని బహుమతిగా ఇచ్చింది. దీని ధర ప్రస్తుతం మార్కెట్‌లో రూ.10 లక్షల వరకు ఉంది.
కొత్త కారులో యాంకర్ లాస్య ఫ్యామిలీ..
View this post on Instagram
భర్త, పిల్లలతో లాస్య..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








