మహేశ్‌కు సారీ చెప్పిన సుకుమార్..?
మహేశ్ బాబు- సుకుమార్ సినిమా క్యాన్సిల్ అవ్వడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా క్యాన్సిల్ అయిందంటూ సోషల్ మీడియా వేదికగా మహేశ్ బాబు వెల్లడించంతో రకరకాల పుకార్లు వినిపించాయి. స్క్రిప్ట్ విషయంలో మహేశ్ తృప్తిగా లేడని.. దీంతో సుకుమార్ ఫీల్ అయ్యాడని, అందుకే బన్నీతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాడని పలు రకాలు వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మహేశ్ బాబుకు సుకుమార్ సారీ చెప్పినట్లు తెలుస్తోంది. మహేశ్ బాబును ఇటీవల […]

మహేశ్ బాబు- సుకుమార్ సినిమా క్యాన్సిల్ అవ్వడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా క్యాన్సిల్ అయిందంటూ సోషల్ మీడియా వేదికగా మహేశ్ బాబు వెల్లడించంతో రకరకాల పుకార్లు వినిపించాయి. స్క్రిప్ట్ విషయంలో మహేశ్ తృప్తిగా లేడని.. దీంతో సుకుమార్ ఫీల్ అయ్యాడని, అందుకే బన్నీతో తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించాడని పలు రకాలు వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మహేశ్ బాబుకు సుకుమార్ సారీ చెప్పినట్లు తెలుస్తోంది.
మహేశ్ బాబును ఇటీవల వ్యక్తిగతంగా కలిసిన సుకుమార్ అతడికి సారీ చెప్పాడట. అంతేకాదు త్వరలో ఓ మంచి స్క్రిప్ట్‌తో వస్తానని మాట ఇచ్చాడట. అయితే దీనిపై మహేశ్ నుంచి ఎలాంటి స్పందన రానట్లు తెలుస్తోంది. అయితే రంగస్థలం బిగ్ హిట్ తరువాత మహేశ్ బాబుతో సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటించాడు సుకుమార్. అన్నీ కుదిరినట్లైతే ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండేది. అయితే కొన్ని కారణాల వలన సినిమా ఆగిపోయింది. దీంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యాడు మహేశ్. మరోవైపు అల్లు అర్జున్‌తో మూడో సినిమాను తెరకెక్కించబోతున్నాడు సుకుమార్.