అయ్యప్పపై సినిమా.. ప్రధానపాత్రలో అనుష్క

హీరోయిన్ అనుష్క కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంతోష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట. అయ్యప్ప స్వామి చుట్టూ సాగే కథతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు సమాచారం. ఆగష్టులో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రశాంత్ అనే కొత్త రచయిత స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను తెలుగులో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు […]

అయ్యప్పపై సినిమా.. ప్రధానపాత్రలో అనుష్క
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 2:07 PM

హీరోయిన్ అనుష్క కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంతోష్ శివన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారట. అయ్యప్ప స్వామి చుట్టూ సాగే కథతో ఈ సినిమాను రూపొందించబోతున్నట్లు సమాచారం. ఆగష్టులో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రశాంత్ అనే కొత్త రచయిత స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను తెలుగులో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నారట. భాగమతి తరువాత అనుష్క సైలెన్స్ చిత్రంలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ కథాంశంతో తీస్తున్న ఈ చిత్రంలో అనుష్క దివ్యాంగురాలి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.