AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ram Charan : కూతురు క్లింకార ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్.. ఎంత ముద్దుగా ఉందో..

రామ్ చరణ్, ఉపాసన గారాల పట్టి క్లింకార కొణిదెల పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా తమ ముద్దుల కూతురు ఫేస్ రివీల్ చేశారు చెర్రీ దంపతులు. ప్రస్తుతం క్లింకార ఫోటో నెట్టింట వైరలవుతుండగా.. మెగా ప్రిన్సెస్ ఎంత ముద్దుగా ఉందో అంటూ మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకార కొణిదెల ముఖాన్ని చూడాలని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Ram Charan : కూతురు క్లింకార ఫేస్ రివీల్ చేసిన రామ్ చరణ్.. ఎంత ముద్దుగా ఉందో..
Ram Charan
Rajitha Chanti
|

Updated on: Jun 20, 2026 | 5:33 PM

Share

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసనల ముద్దుల కుమార్తె క్లీంకార కొణిదెల ముఖాన్ని చూడాలని మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులంతా ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెలబ్రిటీల పిల్లల ప్రైవసీని కాపాడాలనే ఉద్దేశంతో చరణ్ దంపతులు ఇప్పటివరకు క్లీంకార ఫేస్ కనిపించకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు క్లింకార పుట్టినరోజు కావడంతో రామ్ చరణ్, ఉపాసన కలిసి తమ ఫ్యామిలీ ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అందులో క్లింకార తల్లిదండ్రులతో కలిసి నవ్వుతూ కనిపించింది. క్లింకార 2023 జూన్ 20న జన్మించింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు వివాహమైన 11 ఏళ్ల తర్వాత క్లీంకార జన్మించడంతో మెగా కుటుంబంతో పాటు అభిమానులు కూడా ఈరోజును ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. కూతురు పుట్టినప్పటి నుంచి రామ్ చరణ్ తన షూటింగ్ షెడ్యూల్స్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ, క్లీంకార కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తున్నారు. అలాగే తమ కూతురికి లలితా సహస్రనామాల్లోని ‘క్లీంకార’ అనే పదం ఎంపిక చేసి పేరు పెట్టారు. ఈ పేరుకు ప్రకృతి స్వరూపం, ఒక దైవిక శక్తి అనే అర్థాలు ఉన్నాయి.

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

ఇదిలా ఉంటే.. గతంలో బాలకృష్ణ హోస్టింగ్ చేసిన అన్ స్టాపబుల్ టాక్ షోలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. క్లీంకారపై ఎలాంటి పబ్లిక్ ఒత్తిడి ఉండకూడదని, తను ఎప్పుడైతే సొంతంగా ‘నాన్నా’ అని పిలుస్తుందో అప్పుడే అధికారికంగా ప్రపంచానికి చూపిస్తానని సరదాగా చెప్పుకొచ్చారు. కానీ ఆ తర్వాత తిరుమల శ్రీవారి దర్శన సమయంలో మెగా ప్రిన్సెస్ ఫోటోస్ నెట్టింట వైరల్ అయినప్పటికీ ఫేస్ మాత్రం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు ఉపాసన. ఇక ఇప్పుడు తమ చిన్నారి ఫోటోను స్వయంగా నెట్టింట షేర్ చేశారు రామ్ చరణ్, ఉపాసన దంపతులు. చిన్నారి క్లీంకార చాలా ముద్దుగా, క్యూట్‌గా ఉందంటూ మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట పండగ చేసుకుంటున్నారు. “అచ్చం అమ్మ ఉపాసనలాగే ఉంది”, “మెగా ప్రిన్సెస్ సూపర్ క్యూట్” అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..

ఇటీవలే పెద్ది సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు రామ్ చరణ్. డైరెక్టర్ బుచ్చి బాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఇప్పటి వరకు దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూల్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరిగరాసింది. ఇందులో జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..

రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లింకార ఫోటో..

ఎక్కువ మంది చదివినవి :  Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..

Follow Us
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
ఆకాశవాణి భవన్‌ వద్ద హైటెన్షన్.. రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్ నేతల అరెస్ట్..!
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
బంగారం ధర 26% పతనం.. ఇదే కొనడానికి సరైన సమయమా? వేచి ఉండాలా?
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్