Samantha : తల్లి కాబోతున్న సమంత ?.. మా ఇంటి బంగారం సక్సెస్ సెలబ్రేషన్లలో బేబీ బంప్‌తో సామ్..
చాలా కాలం తర్వాత మా ఇంటి బంగారం సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది సమంత. లేడీ ఓరియెంటెడ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా సినిమా మొత్తాన్ని తన భుజంపై వేసుకుని నడిపించింది సామ్. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో సామ్ బేబీ బంప్‌తో కనిపించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

టాలీవుడ్ క్వీన్ సమంత ఇండస్ట్రీలోకి సాలిడ్ రీఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) జూన్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. బి.వి. నందినీ రెడ్డి దర్శకత్వంలో, రాజ్ అండ్ డికె (రాజ్ నిడిమోరు) కథతో, ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఈ మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకలో సామ్ బేబీ బంప్‌తో కనిపించింది. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇఫ్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో సామ్ తల్లి కాబోతుందని.. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరోవైపు, సమంత కానీ, ఆమె భర్త రాజ్ కానీ ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వారు ఈ గుడ్ న్యూస్‌ను ఎప్పుడు అధికారికంగా ప్రకటిస్తారా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా సమంతకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘మా ఇంటి బంగారం’ సినిమా విజయంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ సమంత సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు గతేడాది వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. వీరిద్దరి వివాహం ఈశా యోగా కేంద్రంలోని లింగభైరవి ఆలయంలో భూతశుద్ధి వివాహ విధానంలో జరిగింది. ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్2’, ‘సిటడెల్: హనీ బన్నీ’ కోసం పనిచేస్తున్న సమయంలోనే సమంత, రాజ్‌ల మధ్య పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లపాటు అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడిన సామ్.. ఆ సమయంలో సినిమాలకు దూరంగా ఉండిపోయింది. గతేడాది ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి రాజ్ నిడుమోరు కథ అందించగా, సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీ పతాకంపై సమంత నిర్మించారు.
మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ సెలబ్రెషన్స్..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..
