AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maa Inti Bangaram: ఎవరీ సమంత ఫ్రెండ్‌? ‘మా ఇంటి బంగారం’లో తెగ నవ్వించేసింది.. బ్యాక్ గ్రౌండ్ ఇదే

స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై దర్శనమించ్చింది. ఆమె నటించిన లేటెస్ట్ సినిమా ' మా ఇంటి బంగారం' శుక్రవారం (జూన్ 19) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Maa Inti Bangaram: ఎవరీ సమంత ఫ్రెండ్‌? 'మా ఇంటి బంగారం'లో తెగ నవ్వించేసింది.. బ్యాక్ గ్రౌండ్ ఇదే
Maa Inti Bangaram Movie
Basha Shek
|

Updated on: Jun 20, 2026 | 5:57 PM

Share

ఈ వారం థియేటర్లలో చాలా సినిమాలు రిలీజయ్యాయి. కానీ అందరి దృష్టి సమంత ‘ మా ఇంటి బంగారం’ పైనే నిలిచింది. చాలా రోజుల తర్వాత సామ్ నటించిన సినిమా కావడంతో ముందు నుంచీ ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే శుక్రవారం (జూన్ 19) రిలీజైన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సూపర్ హిట్ టాక్ వచ్చింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమాను చూసేందుకు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో తొలి రోజే ఈ సినిమాకు రూ. 13 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చినట్లు చిత్ర బృందం ప్రకటించింది. బీవీ నందిని రెడ్డి తెరకెక్కించిన ‘మా ఇంటి బంగారం’ మూవీలో చాలా మంది స్టార్స్ ఉన్నారు. సమంతతో పాటు శ్రీముఖి, గుల్షన్ దేవయ్య, చైతన్య కృష్ణ, శ్రీలక్ష్మి, గౌతమి, వెన్నెల కిశోర్ తదితరులు ఈ మూవీలో వివిధ పాత్రలు పోషించారు. అయితే ఎంత మంది ఉన్నా ఈ సినిమాలో సమంతనే హైలెట్ గా నిలిచింది. ఆమె అభినయం, యాక్షన్ సీక్వెన్స్ ఆడియెన్స్ ను బాగా అలరించాయి. అయితే ఇదే మా ఇంటి బంగారం సినిమాలో సామ్ తో పాటు మరో రోల్ కూడా హైలైట్ గా నిలిచింది. అదే హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర కిరణ్మయి. ‘లెట్స్ కమాన్’ అంటూ ఆడియెన్స్ ను తెగ నవ్వించిందామె? మరి ఇంతకీ ఈ నటి ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం రండి.

కాగా సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ చేసి ఫేమస్ అయిన చాలా మంది హీరోయిన్లుగా అవకాశం దక్కించుకున్నారు. ‘మా ఇంటి బంగారం’లో సమంత స్నేహితురాలిగా నటించిన మంజూష ముక్కవిల్లి కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఇన్ స్టా గ్రామ్ రీల్స్ బాగా చూసే వారికి మంజూష బాగానే పరిచయముంటుంది. సూర్య కాంతం, నిర్మలమ్మ, ఛాయా దేవి తదితర సీనియర్ నటీమణుల్లా రీల్స్ చేస్తూ బాగా నెట్టింట బాగా ఫేమస్ అయిపోయింది మంజూష.

ఇవి కూడా చదవండి

మా ఇంటి బంగారం సినిమాలో మంజూష..

ఇదే క్రమంలో డైరెక్టర్ నందినీ రెడ్డి కంట కూడా మంజూష రీల్ పడింది. వెంటనే ఆమెను పిలిపించి ఆడిషన్ తీసుకుంది. మూడు సార్లు ఆడిషన్ చేసిన పిదప సమంత ఫ్రెండ్ క్యారెక్టర్ కోసం మంజూషను సెలెక్ట్ చేసింది. నందినీ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ తనదైన నటనతో అదరగొట్టింది మంజూష. తొలి సినిమానే అయినప్పటికీ చాలా సహజంగా నటించి అందరి మన్ననలు అందుకుంటోంది. ఓవైపు అమాయకంగా కనిపిస్తూనే మరోవైపు గడుసుతనం ప్రదర్శించే సీన్స్‌లో మంజూష యాక్టింగ్ ఆడియెన్స్ ను తెగ నవ్విస్తోంది. హైదరాబాద్ లో నే నివాసముంటోన్న ఆమెకు రాబోయే రోజుల్లో మరిన్ని సినిమా అవకాశలు వస్తాయేయో చూడాలి.

సమంతతో మంజూష..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
పాత బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే వారంటీ క్యాన్సిల్ అవుతుందా?..
పాత బండ్లలో E20 పెట్రోల్ కొట్టిస్తే వారంటీ క్యాన్సిల్ అవుతుందా?..
రాసి పెట్టుకోండి.. వీరి జీవితంలో గొప్ప మలుపు
రాసి పెట్టుకోండి.. వీరి జీవితంలో గొప్ప మలుపు
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా మిస్సైన హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
టీమిండియా ఓటమికి గల అసలు కారణాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్
టీమిండియా ఓటమికి గల అసలు కారణాన్ని వెల్లడించిన మాజీ క్రికెటర్
మామిడి జీడిని పారేస్తున్నారా? దానిలోని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు
మామిడి జీడిని పారేస్తున్నారా? దానిలోని అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు
పొరపాటున కూడా ఈ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచవద్దు
పొరపాటున కూడా ఈ మొక్కలను ఇంటి ఆవరణలో పెంచవద్దు
కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..!
కుక్కలను చంపే ఇంజెక్షన్ ఇచ్చి బావను చంపిన బావమరిది..!
కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి నిశ్చితార్థం..
కొరియన్ అమ్మాయితో మహేష్ బాబు మేనల్లుడి నిశ్చితార్థం..
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే..! వారికోసం..
తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే..! వారికోసం..
చిరు వ్యాపారులు, బ్యాచిలర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్..
చిరు వ్యాపారులు, బ్యాచిలర్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్..