‘టర్కీస్’ మూవీ రీమేక్‌లో రాజ్ తరుణ్..?

హ్యాట్రిక్ విజయాలతో టాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఆ తరువాత వరుస పరాజయాలతో ఢీలా పడ్డాడు. దీంతో అతడి కెరీర్ కాస్త గాడి తప్పగా.. రాజ్ తరుణ్‌తో సినిమాను నిర్మించేందుకు టాప్ నిర్మాత దిల్ రాజు సిద్ధమైనట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం టర్కీస్ రీమేక్ అని తెలుస్తోంది. దిల్ రాజుకు ఈ మూవీ బాగా నచ్చిందని, అందుకే ఈ మూవీ రీమేక్ చేసేందుకు ఆయన ముందుకొచ్చాడని […]

‘టర్కీస్’ మూవీ రీమేక్‌లో రాజ్ తరుణ్..?
Follow us

| Edited By:

Updated on: Mar 11, 2019 | 2:13 PM

హ్యాట్రిక్ విజయాలతో టాలీవుడ్‌లో క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో రాజ్ తరుణ్.. ఆ తరువాత వరుస పరాజయాలతో ఢీలా పడ్డాడు. దీంతో అతడి కెరీర్ కాస్త గాడి తప్పగా.. రాజ్ తరుణ్‌తో సినిమాను నిర్మించేందుకు టాప్ నిర్మాత దిల్ రాజు సిద్ధమైనట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి.

తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం టర్కీస్ రీమేక్ అని తెలుస్తోంది. దిల్ రాజుకు ఈ మూవీ బాగా నచ్చిందని, అందుకే ఈ మూవీ రీమేక్ చేసేందుకు ఆయన ముందుకొచ్చాడని సమాచారం.  ఈ చిత్రం కోసం రాజ్ తరుణ్ పారితోషికం తీసుకోకుండా లాభాల్లో షేర్లను మాత్రం తీసుకోబోతున్నట్లు టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ద్వారా కొత్త దర్శకుడు పరిచయం అవుతుండగా.. వచ్చే నెల నుంచి షూటింగ్ జరుపుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కోసం స్క్రిప్ట్ పనులను రాజ్ తరుణ్‌ను చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Latest Articles