AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పల్లెటూరి స్టైల్‌లో బిర్యానీ.. ఇలా చేస్తే సండే మీ ఇంట్లో సందే సందడి

సండే వచ్చింది అంటే చాలు చాలా మంది తమ ఇంటిలో బిర్యానీ చేసుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. పిల్లలకు హాలీడే,కుటుంబ సభ్యులంతా కూడా ఒక చోట చేరుతుంటారు. దీని వలన అందరూ కలిసి మంచి గుమ గుమలాడే చికెన్ బిర్యానీ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు. పట్టణంలోనే కాదండోయ్ పల్లెటూరిలో కూడా సండే బిర్యానీ గుమ గుమలు ప్రతి వాడలో వస్తుంటాయి. అయితే మీరు కూడా బిర్యానీ చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే పల్లెటూరి స్టైల్‌లో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jun 20, 2026 | 9:08 PM

Share
కావాల్సిన పదార్థాలు : చికెన్, బాస్మతి రైస్, పెరుగు, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఆనియన్స్ ,పూదీనా, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మాసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, నిమ్మరసం, కొత్తిమీర, బిర్యానీ మసాలా.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే : ముందుగా చికెన్ తీసుకోవాలి. శుభ్రం చేసిన ఒక కిలో చికెన్ కు ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కలిపి చేతితో బాగా మ్యారినేట్ చేయాలి. దీనికి తరిగిన కొత్తిమీర, పుదీనా, వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక కప్పు పెరుగు, నిమ్మరసం, ధనియాల పొడి, గరం మసాలా, ఉల్లిపాయలు వేయించిన నూనె కలిపి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి.

2 / 5
ఇప్పుడు బిర్యానీ రైస్ రెడీ చేసుకోవాలి. దీని కోసం ఒక కిలో బాస్మతి రైస్ (రెండు గ్లాసులు) తీసుకుని, కడిగి కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. ఒక పెద్ద గిన్నెలో నీరు పోసి మరిగించాలి.  ఒక చిన్న గిన్నెలో ఎనిమిది లవంగాలు, ఐదు యాలకులు, రెండు మరాఠీ మొగ్గలు, ఒక అనస పువ్వు తీసుకోవాలి.   మరుగుతున్న నీటిలో ఈ మసాలా దినుసులు, తరిగిన పుదీనా ఆకులు, కొత్తిమీర, మధ్యలోకి కట్ చేసిన మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసి పది నిమిషాలు మరగనివ్వాలి.   నీరు కొద్దిగా రంగు మారిన తర్వాత, నానబెట్టిన బాస్మతి రైస్ ను ఇందులో వేసి పది నిమిషాలు ఉడకనివ్వాలి. రైస్ 50-60% మాత్రమే ఉడకాలి.

3 / 5
ఆ తర్వాత మరో వైపు పాన్ పెట్టి, అందులో నూనె పోసి, బిర్యానీ ఆకు, లవంగాలు, ఆనియన్స్, పచ్చి మిర్చీ ,అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసి 10 నిమిషాల పాటు మంచిగా ఉడకబెట్టుకోవాలి. బాగా ఉడికి గ్రేవి వచ్చేలా చూసుకోవాలి. తర్వాత అందులో చివరిగా, పాక్షికంగా ఉడికించిన రైస్ ను పొరలుగా వేసి, వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనాతో అలంకరించి, మీడియం మంటపై 20 నిమిషాలు దమ్ చేస్తే, రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ సిద్ధం.

4 / 5
ఈ టేస్టే టేస్టీ పల్లెటూరి స్టైల్ బిర్యానీని ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు. అంతే కాకుండా మరీ అంతగా మసాలాలు లేకుండా రుచి కూడా చాలా అద్భతుంగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి

5 / 5
Follow Us
పల్లెటూరి స్టైల్‌లో బిర్యానీ.. ఇలా చేస్తే సండే మీ ఇంట్లో సందడే

మోకాళ్ల కింది నుంచి పాదాల వరకు నొప్పి ఎందుకు..?

వెంకన్న సేవలో మోక్షజ్ఞ.. తిరుమల, శ్రీకాళహస్తిలో ప్రత్యేక పూజలు!

తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరోయిన్..

బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ కాంట్రవర్సీ యూట్యూబర్ ఎంట్రీ పక్కా!

ఉదయం లేదా రాత్రి, ఏ సమయంలో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది?

ఎదుటివారు అబద్ధం చెప్తున్నారా..? ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా..

నాలుగు రోజులు ఓపిక పడితే చాలు.. వీరి ఇంట కనక వర్షమే

సిల్క్,శాటిన్ మధ్య తేడా ఏంటి? ఒరిజినల్ పట్టును గుర్తించే చిట్కాలు

ఆ నటుడి చివరి చూపు కోసం అందుకే వెళ్లలేదు..