AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mamagaru: స్టార్ మాలో మరో ఆసక్తికర సీరియల్.. ప్రేక్షకులను ఆకట్టుకోనున్న మామగారు.. టెలికాస్ట్ ఎప్పటినుంచంటే..

ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యునిగా ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న ఈ ఛానెల్ ఇప్పుడు సరికొత్త కథనంతో మరో మారు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి "మామగారు" అంటూ వస్తోంది. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే వినూత్నమైన కథ అంశాలలాగానే కథనం కలిగిన ఈ సీరియల్, అహంకారానికి - ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఉంటుంది. డిగ్రీని పూర్తి చేసి పీజీ చేయాలని, వున్నత వుద్యోగం చేసి వికలాంగురాలైన చెల్లెలు, అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకునే యువతి గంగ. బాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే ఒక పెద్ద కుటుంబం లో కోడలిగా అడుగు పెట్టాలని కోరుకుంటుంది ఆమె.

Mamagaru: స్టార్ మాలో మరో ఆసక్తికర సీరియల్.. ప్రేక్షకులను ఆకట్టుకోనున్న మామగారు.. టెలికాస్ట్ ఎప్పటినుంచంటే..
Mamagaru
Rajeev Rayala
|

Updated on: Sep 10, 2023 | 12:47 PM

Share

వాస్తవికతకు దగ్గరగా వుండే కథలు, ఆకట్టుకునే కథనాలు, మనసును తట్టి లేపే పాత్రలు, హృదయాంతరాలను తాకే సంభాషణలతో కూడిన సీరియల్స్ తో తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంటినీ ఆకట్టుకున్న వినోద వేదిక స్టార్ మా. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యునిగా ఆత్మీయంగా అక్కున చేర్చుకున్న ఈ ఛానెల్ ఇప్పుడు సరికొత్త కథనంతో మరో మారు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి “మామగారు” అంటూ వస్తోంది. ఈ నెల 11 వ తేదీ నుంచి సోమవారం నుంచి శనివారం వరకూ ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటలకు ఈ సీరియల్ ప్రసారం కానుంది. స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే వినూత్నమైన కథ అంశాలలాగానే కథనం కలిగిన ఈ సీరియల్, అహంకారానికి – ఆత్మవిశ్వాసానికి నడుమ జరిగిన పోరులా ఉంటుంది.

డిగ్రీని పూర్తి చేసి పీజీ చేయాలని, వున్నత ఉద్యోగం చేసి వికలాంగురాలైన చెల్లెలు, అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని కోరుకునే యువతి గంగ. బాగా చదువుకుని ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే ఒక పెద్ద కుటుంబం లో కోడలిగా అడుగు పెట్టాలని కోరుకుంటుంది ఆమె.

చెంగయ్య , ఓ పెద్ద మనిషి. పేరున్న కుటుంబానికి చెందిన వ్యక్తి. తన మాటే చెల్లుబాటు కావాలనుకునే పంతం కలిగిన వ్యక్తి. ఆయన మూడో కుమారుడైన గంగాధరన్‌కు చదువుపై ఆసక్తి లేకపోవడంతో చిన్నతనంలోనే ఎలక్ట్రీషియన్‌గా పనికి వెళ్లాడు. తండ్రి చేత తిట్లు తినే అతను, ఈ బాధల నుంచి విముక్తి కావాలనుకుంటూ తప్పుడు సర్టిఫికెట్లు తో దుబాయ్‌కి వెళ్లాలని ప్రణాళిక చేస్తాడు. అయితే, అతను ఫోర్జరీ చేయాలనుకున్నది గంగకు చెందిన సర్టిఫికేట్‌లు కావటం… ఈ విషయం తెలిసి గంగ ఫిర్యాదు చేయటంతో , ప్రభుత్వం గంగాధరన్ పాస్‌పోర్ట్‌ను నిషేదిస్తుంది. పెళ్లి చేస్తే అయినా తమ కుమారుడు గంగాధరన్ మారతాడని భావించి, చెంగయ్య తన సోదరి కుమార్తె సుభద్రతో గంగాధరన్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ సుభద్ర గంగాధరన్‌ని పెళ్లి చేసుకోవడానికి నిరాకరిస్తుంది.

అయినప్పటికీ చెంగయ్య పెళ్లికి ఏర్పాట్లు చేస్తాడు. తన స్నేహితుడి కుమార్తె గంగతో గంగాధరన్ పెళ్లి చేయాలని చెంగయ్య ప్లాన్ చేస్తాడు. అదే సమయంలో గంగ తండ్రికి ప్రాణాపాయ స్థితి ఏర్పడటం.. డబ్బుకు ఇబ్బంది పడుతున్న గంగకు ధన సహాయం చేసి ఆమె తండ్రి ని కాపాడి బదులుగా తన కుమారుడిని పెళ్లి చేసుకోవాలని కోరతాడు. తమ కూతురును చెంగయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని హామీ ఇచ్చిన గంగ తండ్రి, పెళ్లయ్యాక కూడా గంగను చదివించాలని కోరతాడు. ఇంట్లో ఆడపిల్లలెవరూ పెద్దగా చదువుకోకూడదని నిషేధం విధించిన చెంగయ్య , సరేనంటూ తల ఊపుతాడు. నిజానికి పితృ స్వామ్య స్వభావం నరనరాన జీర్ణించుకున్న చెంగయ్య, తన భార్య డాక్టర్ అనే సంగతి కనీసం కుటుంబ సభ్యులకు కూడా తెలియనియ్యడు. అలాంటి వాడు తన కోడలిని చదువుకోనిస్తాడా ? తానెవరిని పెళ్లి చేసుకుంటున్నాడో కూడా తెలియని గంగాధరన్‌, మంగళసూత్రం కట్టేటప్పుడు గంగ ముఖం చూస్తాడు. తన దుబాయ్ కలలు కల్లలు కావటానికి కారణమైన గంగను భార్యగా గంగాధరన్‌ అంగీకరించాడా ? ఒక పెద్ద ఇంటికి కోడలు కావాలనే కల సాకారమైనందుకు సంతోషంగా కొత్త ఇంటికి అడుగు పెట్టిన గంగ , ఒక వైపు తనను అసహ్యించుకునే భర్త, మరోవైపు స్త్రీలను బానిసలుగా భావించే మామగారు.. నడుమ తన కలను సాకారం చేసుకోవటానికి ఎలా పోరాడుతుంది ? ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో అనుక్షణం ఆకట్టుకునే కథనం తో కూడిన మామగారు సీరియల్ ప్రతి రోజూ సోమవారం నుండి శనివారం వరకూ సాయంత్రం 6.30 గంటలకు స్టార్ మా లో ప్రసారమవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.ఆడియన్స్

Follow Us