AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Star Maa: గ్రాస్ రేటింగ్ పాయిట్స్‌లో సత్తా చాటిన స్టార్ మా.. రికార్డులు తిరగరాస్తున్న సీరియల్స్

బార్క్‌ 2023వ సంవత్సరానికిగానూ 13వ వారం విడుదల చేసిన రేటింగ్స్‌లో ప్రైమ్‌ టైమ్‌ తోపాటు నాన్‌ ప్రైమ్‌ ట్రైమ్‌లో కూడా ఇతర జీఈసీ ఛానెల్స్‌ రేటింగ్స్ ని దాటుకుంటూ, అత్యధిక రేటింగ్స్‌ సాధించింది స్టార్‌ మా.

Star Maa: గ్రాస్ రేటింగ్ పాయిట్స్‌లో సత్తా చాటిన స్టార్ మా.. రికార్డులు తిరగరాస్తున్న సీరియల్స్
Star Maa
Rajeev Rayala
|

Updated on: Apr 12, 2023 | 4:15 PM

Share

టీవీ సీరియల్స్ ప్రేక్షకులను ఎంతలా ఆకట్టుకుంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగా ఆడవాళ్లు సీరియల్స్ చూస్తూ ఉంటారు. టీవీ సీరియల్స్ పుణ్యమా అని ఛానెల్స్ రేటింగ్స్ లో దూసుకుపోతున్నాయి. బార్క్‌ 2023వ సంవత్సరానికిగానూ 13వ వారం విడుదల చేసిన రేటింగ్స్‌లో ప్రైమ్‌ టైమ్‌ తోపాటు నాన్‌ ప్రైమ్‌ ట్రైమ్‌లో కూడా ఇతర జీఈసీ ఛానెల్స్‌ రేటింగ్స్ ని దాటుకుంటూ, అత్యధిక రేటింగ్స్‌ సాధించింది స్టార్‌ మా.  గ్రాస్ రేటింగ్ పాయిట్స్ విషయంలో తెలుగు ఛానెల్స్‌ లో మాత్రమే కాదు, దేశం మొత్తం మీద మరే ఇతర భాషలోని వినోద ఛానెల్స్‌ సాధించలేని అరుదైన రికార్డు ను సాధించింది స్టార్ మా. స్టార్‌ మాలో రీసెంట్ గా స్టార్ట్ అయిన ‘నాగపంచమి’, ‘బ్రహ్మముడి’ సీరియల్స్‌ గత రికార్డులన్నింటినీ తిరగరాశాయి. గత మూడేళ్లగా కొనసాగుతున్న రికార్డులను సైతం బ్రేక్‌ చేస్తూ ‘నాగపంచమి ’సీరియల్‌ 11556 జీఆర్‌పీలు, ‘బ్రహ్మముడి’ సీరియల్‌ 10372.2 జీఆర్‌పీలు సాధించాయి. ఈ రికార్డులకు దూరంగా సన్‌టీవీలో ప్రారంభమైన ‘వనథై పోలా ’9661.2 జీఆర్‌పీలు; స్టార్‌ ప్లస్‌లో ప్రారంభమైన ‘ఇమ్లీ’ (8814.1), కలర్స్‌లో ‘నాగిన్‌ 5’ (8700.5) తరువాత స్థానాలలో నిలిచాయి.

ఇదే రీతిలో తెలుగు సినీ అభిమానుల వినోద కేంద్రంగా స్టార్‌మా మూవీస్‌, జెమినీ టీవీని వెనక్కి నెట్టి 228 జీఆర్‌పీల రేటింగ్‌ సాధిస్తే, ఇండియాలో నెంబర్‌1 మ్యూజిక్‌ ఛానెల్‌గా స్టార్‌ మా మ్యూజిక్‌ స్పష్టమైన ఆధిక్యతను ఇతర మ్యూజిక్‌ ఛానెల్స్‌పై చూపింది. స్టార్‌ మా మ్యూజిక్‌ 75900 జీఆర్‌పీలు, ఎంటీవీ బీట్స్‌ కేవలం 65,213 జీఆర్‌పీలు మాత్రమే సాధించింది.

ఇవి కూడా చదవండి

గత వారం రేటింగ్స్‌లో స్టార్‌ మా, తమకు పోటీగా చెప్పుకుంటున్న ఛానల్స్‌పై స్పష్టమైన ఆధిపత్యాన్నిచూపింది.  మొత్తంమ్మీద 882 జీఆర్‌పీ ల రేటింగ్‌ను సాధించగా, పోటీ ఛానెల్‌ కేవలం 772 జీఆర్‌పీ లకు మాత్రమే పరిమితం కావాల్సివచ్చింది. స్టార్‌ మా ప్రైమ్‌టైమ్‌ జీఆర్‌పీ లలో 342 , నాన్‌ ప్రైమ్‌ టైమ్‌లో 510 సాధించింది.

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..