కలిసి జపాన్‌ వెళ్తోన్న ప్రభాస్, అనుష్క..?

కలిసి జపాన్‌ వెళ్తోన్న ప్రభాస్, అనుష్క..?

‘బాహుబలి’ విడుదల తరువాత ప్రభాస్, అనుష్కల పెళ్లిపై చాలా వార్తలే వచ్చాయి. ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని వారి వారి అభిమానులు కూడా కోరుకున్నారు. అయితే వాటన్నింటిని ఖండిస్తూ తాము మంచి స్నేహితులమే అని చెప్పుకుంటూ వస్తున్నారు ఆ ఇద్దరు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి గురించిన మరో ఆసక్తికర వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ప్రభాస్, అనుష్క కలిసి జపాన్‌కు వెళుతున్నారట. ‘బాహుబలి’ తరువాత ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 4:49 PM

‘బాహుబలి’ విడుదల తరువాత ప్రభాస్, అనుష్కల పెళ్లిపై చాలా వార్తలే వచ్చాయి. ఈ ఇద్దరు పెళ్లి చేసుకుంటే చూడాలని వారి వారి అభిమానులు కూడా కోరుకున్నారు. అయితే వాటన్నింటిని ఖండిస్తూ తాము మంచి స్నేహితులమే అని చెప్పుకుంటూ వస్తున్నారు ఆ ఇద్దరు. ఇదిలా ఉంటే ఈ ఇద్దరి గురించిన మరో ఆసక్తికర వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే ప్రభాస్, అనుష్క కలిసి జపాన్‌కు వెళుతున్నారట.

‘బాహుబలి’ తరువాత ప్రభాస్‌కు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది ‘బాహుబలి’. దీంతో ప్రభాస్ నటించిన పాత చిత్రాలను అక్కడ విడుదల చేస్తున్నారు నిర్మాతలు. అందులో భాగంగా ప్రభాస్ నటించిన ‘మిర్చి’, ‘డార్లింగ్’ చిత్రాలను అక్కడ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్, అనుష్క అక్కడికి వెళుతున్నారు. అక్కడ జపాన్ ప్రేక్షకులతో ఈ ఇద్దరు మిర్చి స్పెషల్ షోను చూడనున్నారు. అందుకోసమే ఈ ఇద్దరు కలిసి జపాన్‌కు వెళుతున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ సాహోలో నటిస్తుండగా.. అనుష్క త్వరలో సైలెన్స్ మూవీ షూటింగ్‌లో పాల్గొననుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu