Bigg Boss 6: అదిరిపోయిన బిగ్‌బాస్ కర్టెన్ రైజ్ ప్రోమో.. ఈ కంటెస్టెంట్ల గొంతును గుర్తుపట్టారా?
Bigg Boss 6 Telugu: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యహరిస్తోన్న బిగ్‌బాస్- 6 గ్రాండ్ లాంఛింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఒకేసారి అటు స్టార్‌మా, డిస్నీ హాట్‌స్టార్‌లోనూ ఈ రియాలిటీ షో ప్రసారం కానుంది.
Bigg Boss 6 Telugu: అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యహరిస్తోన్న బిగ్‌బాస్- 6 గ్రాండ్ లాంఛింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఒకేసారి అటు స్టార్‌మా, డిస్నీ హాట్‌స్టార్‌లోనూ ఈ రియాలిటీ షో ప్రసారం కానుంది. ఈనేపథ్యంలో షో పై మరింత బజ్ పెంచేందుకు తాజాగా ఓ కర్టెన్ రైజర్ ప్రోమోను విడుదల చేసింది బిగ్‌బాస్ యాజమాన్యం. ఎప్పటిలాగే ఈ ప్రోమోలో కింగ్ మరింత ఎనర్జిటిక్‌గా కనిపించారు. రెట్టింపు ఉత్సాహంతో కంటెస్టెంట్స్ హౌస్‌లోకి స్వాగతం పలికారు. ఇక ఈ సీజన్‌లో కంటెస్టెంట్ల వివరాలను రివీల్ చేయలేదు గానీ కొందరు హౌస్‌మేట్స్ వాయిస్ లని మాత్రం ప్రోమోలో వినిపించారు. రెగ్యులర్‌గా వినిపించే వాయిస్‌లని బట్టి కొందరు కంటెస్టెంట్లను నెటిజన్లు, ప్రేక్షకులు ఈజీగా గుర్తు పట్టేశారు. ముఖ్యంగా సింగర్ రేవంత్, జబర్దస్త్ చంటి గొంతను ఈజీగా ఐడింటిఫై చేయొచ్చు.
ఇక షోలో పాల్గొంటున్న ఫీమేల్ కంటెస్టెంట్లలో కూడా కొంత మంది వాయిస్ రివీల్ అయ్యింది. ముఖ్యంగా సీరియల్ ఆర్టిస్ట్ శ్రీ సత్య, మెరినా వాయిస్‌లును నెటిజన్లు గుర్తుపట్టారు. మొత్తానికి ఎప్పటిలాగే కలర్ ఫుల్ లైటింగ్స్, కంటెస్టెంట్‌డాన్స్ లతో లాంచింగ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేసినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. మరి ఆరు గంటలకు ప్రారంభమయ్యే బిగ్‌బాస్ గ్రాండ్ లాంచింగ్ అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే https://tv9telugu.com/ చూస్తూ ఉండండి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..