MAD Movie: సైలెంట్‏గా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది.. కలెక్షన్స్‏తో దుమ్మురేపుతోన్న ‘మ్యాడ్’.. అసలేముంది ఈసినిమాలో ?

మొదటిరోజే భారీగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా ?.. అదే 'మ్యాడ్'. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త దర్శకుడితో ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించి అలరించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 6న అడియన్స్ ముందుకు వచ్చింది.

MAD Movie: సైలెంట్‏గా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది.. కలెక్షన్స్‏తో దుమ్మురేపుతోన్న 'మ్యాడ్'.. అసలేముంది ఈసినిమాలో ?
Mad Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 07, 2023 | 11:53 AM

ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టిస్తోంది ఓ చిన్న సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‏గా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. అంతేకాదు మొదటిరోజే భారీగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకీ ఏంటా మూవీ అనుకుంటున్నారా ?.. అదే ‘మ్యాడ్’. కొత్త హీరోలు, కొత్త హీరోయిన్లు, కొత్త దర్శకుడితో ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇందులో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించి అలరించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ తో యూత్ కు ఎక్కువగా కనెక్ట్ అయ్యింది. విడుదలకు ముందే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ అక్టోబర్ 6న అడియన్స్ ముందుకు వచ్చింది.

కాలేజీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ముగ్గురి స్నేహితుల జర్నీతో హిలేరియన్ కామెడీని అందించారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఈ సినిమాను యూత్‏కు బాగా కనెక్ట్ అయ్యే విధంగా రూపొందించడంలో సక్సెస్ అయ్యారు. మొదటి షోలోనే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అంతకు ముందు ప్రీమియర్స్ లోనూ మంచి టాక్ అందుకుంది ఈ చిత్రం. ముఖ్యంగా యూత్ నుంచి పాజిటివ్ మౌత్ టాక్ అందుకున్న ఈ మూవీని చూసేందుకు ప్రేక్షకులకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఫస్ట్ డే ఈ మూవీ ఏకంగా రూ.1.8 కోట్లు రాబట్టింది. ఇక ఈరోజు, రేపు హాలిడేస్ కావడంతో ఈ సినిమాకు మరిన్ని కలెక్షన్స్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అక్టోబర్ 19 వరకు మరో సినిమా రిలీజ్ కాబట్టి ఈ లాంగ్ రన్ లో మ్యాడ్ సినిమాకు మరిన్ని కలెక్షన్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. ఇక అదే జరిగితే తక్కువ సమయంలోనే మ్యాడ్ సినిమా సాలిడ్ నంబర్ పోస్ట్ చేయడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ప్రామిసింగ్ హిలేరియస్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ఈ సినిమాను ఫార్చూన్ 4 సినిమాస్ తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఈ సినిమాలో గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక, గోపికా ఉద్యాన్, విష్ణు, మురళీధర్ గౌడ్, రఘుబాబు కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.