Brahmamudi, October 7th episode: కళ్యాణ్ ని ప్రేమిస్తున్న అప్పు.. నిజం తెలిసి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన కావ్య!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కళ్యాణ్, అనామికలను చూసి దిగాలుగా అప్పు బయటకు వస్తుంది. అప్పు కోసం వచ్చిన కనకం ఇక్కడ కూర్చున్నావేంటే.. రా భోజనం చేద్దాం అని పిలుస్తుంది. కానీ అప్పు మాత్రం చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఈలోపు కనకం లోపలికి వస్తుంది. అప్పు ఎక్కడ అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. అప్పు వెళ్లిపోయిందని కనకం చెప్తుంటే.. అదేంటి పండగ పూట ఇంటికి వచ్చి తినకుండా వెళ్లకూడదని తెలీదా.. అని అపర్ణ అంటే.. తనకు కొంచెం తలనొప్పిగా ఉందని వెళ్లిందని కనకం అంటుంది. ఇక కనకం వెళ్లి కృష్ణమూర్తి దగ్గర కూర్చుంటంది. ధాన్య లక్ష్మి కావ్యని..
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కళ్యాణ్, అనామికలను చూసి దిగాలుగా అప్పు బయటకు వస్తుంది. అప్పు కోసం వచ్చిన కనకం ఇక్కడ కూర్చున్నావేంటే.. రా భోజనం చేద్దాం అని పిలుస్తుంది. కానీ అప్పు మాత్రం చేయను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఈలోపు కనకం లోపలికి వస్తుంది. అప్పు ఎక్కడ అని ధాన్య లక్ష్మి అడుగుతుంది. అప్పు వెళ్లిపోయిందని కనకం చెప్తుంటే.. అదేంటి పండగ పూట ఇంటికి వచ్చి తినకుండా వెళ్లకూడదని తెలీదా.. అని అపర్ణ అంటే.. తనకు కొంచెం తలనొప్పిగా ఉందని వెళ్లిందని కనకం అంటుంది. ఇక కనకం వెళ్లి కృష్ణమూర్తి దగ్గర కూర్చుంటంది. ధాన్య లక్ష్మి కావ్యని పిలిచి.. నువ్వు వడ్డించింది చాలు కానీ.. వెళ్లి మీ ఆయన కూర్చోమని చెప్తుంది. నువ్వు రావడం లేదని రాజ్ ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు. వెళ్లు మళ్లీ మళ్లీ ఇలాంటి అవకాశం రాదు అని ధాన్య లక్ష్మి అంటుంది. మీరు మా ఆయన చాలా రొమాంటిక్ అని అనుకుంటున్నారు.. కానీ నేను చేసే టమాటా పప్పు కంటే.. సుద్ద పప్పు అని తెలీదని కావ్య అంటుంది. ఇక కావ్య వెళ్లి రాజ్ పక్కన కూర్చుంటుంది.
దుగ్గిరాల ఫ్యామిలీలో సందడే సందడి.. రాజ్, కావ్యల గిల్లి కజ్జాలు:
ఇక రాజ్ కోపంగా కావ్య వైపు చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నారు.. మీ పక్కన కూర్చోకూడదా అని కావ్య అడగ్గా.. కూర్చున్నాక లేవకూడదు కదా అని రాజ్ సమాధానం ఇస్తాడు. చిన్న అత్తయ్య ఫోర్స్ చేసి మరీ ఇక్కడ కూర్చోమంటే కూర్చున్నా అని కావ్య అంటుంది. ఇది ఆవిడ ఫీలింగా.. లేక నీ ఫీలింగా అని అని కావ్యని అంటుంది. ఇక కావ్య కావాలనే గట్టిగా ధాన్య లక్ష్మిని పిలుస్తుంది. దీంతో రాజ్.. కావ్య నోరు మూస్తాడు. ఇక రుద్రాణి షరా మామూలుగానే పుల్లలు పెడుతుంది. ఇక సీతా రామయ్య రియాక్ట్ అవుతూ భార్య కోసం మారితే తప్పేముంది అని అంటాడు. ఇక అందరూ సరదగా నవ్వుతూ భోజనం చేస్తారు.
కన్నీళ్లు పెట్టుకున్నా సీతా రామయ్య.. నిజం తెలుసుకున్న కావ్య:
ఇక ఇదంతా చూసిన సీతా రామయ్య కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏమైంది బావా.. ఏంటా కన్నీళ్లు అని ఇందిరా దేవి అడుగుతుంది. మన రోజుల్లో అందరం ఇలా కలిసి భోజనం చేసేవారు.. మళ్లీ ఈ రోజు ఇలా అందరం కలిసి తింటుంటే చాలా ఆనందంగా ఉందని అంటాడు. ఇక అందరూ భోజనం చేస్తారు. ఈలోపు కావ్య, రాజ్ లు కూడా భోజనం చేసి తమ గదిలోకి వస్తారు. ఇక కావ్య కావాలనే రాజ్ ని ఆట పట్టిస్తుంది. ఎవరూ లేనప్పుడు సిగ్గు పడతావ్.. అందరూ ఉన్నప్పుడు మాత్రం రెచ్చిపోతావ్.. ఇందాక భోజనం చేసేటప్పుడు అందరి ముందూ తెగ రెచ్చిపోయావ్ ఏంటి? అని రాజ్ అంటాడు. నటించడమా నేనా అని కావ్య అంటుంది. ఇక ఇద్దరూ కాసేపు గిల్లికజ్జాలు ఆడుకుంటారు. ఆ తర్వాత రాజ్ బయటకు వెళ్తాడు. ఇక కావ్య కూడా బయటకు వచ్చి రాజ్ రాసిన చీటీని చదువుతుంది. అందులో రాజ్ రాసిన దాన్ని చదివి.. షాక్ అవుతుంది. పాత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. రాజ్ మీద ఎంతో కోపం వస్తుంది. కానీ ఏం చేయాలో తెలీక ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది.
కళ్యాణ్ ని ప్రేమిస్తున్నట్టు తెలుసుకున్న అప్పు.. ఏం జరగబోతుందో చెప్పిన కనకం అక్క:
ఈ సీన్ కట్ చేస్తే.. కనకం, కృష్ణమూర్తి ఇద్దరూ ఇంటికి వస్తారు. ఇక అప్పు వచ్చి నేనేమీ తినలేదు.. ఏమైనా చేయి అంటుంది. అప్పుడు అనిపించలేదు.. ఇప్పుడు వేస్తుంది పెట్టవా అని అంటుంది అప్పు. నువ్వు బాగానే ఉన్నావా అని కనకం అడిగితే.. అప్పు చిరాగ్గా అక్కడి నుంచి వెళ్లి పోతుంది. ఇక అప్పు బిహేవియర్ పై కనకం అనుమానిస్తుంది. ఇదంతా గమనించిన పెద్దావిడ.. వెళ్లి అప్పు దగ్గరకి వెళ్తుంది. నువ్వు కళ్యాణ్ ని ఇష్టపడుతున్నావా.. అని అంటుంది. అప్పూ మాత్రం సమాధానం ఏమీ చెప్పకుండా ఉంటుంది. ఇక అప్పు పెద్దమ్మ.. నువ్వు కళ్యాణ్ ని ఇష్టపడుతున్నావ్ కదా.. కానీ ఒక్కసారి మీ అమ్మ గురించి, ఇద్దరి అక్కడ గురించి ఆలోచించమని చెప్తుంది. ఈ విషయాన్ని బయటకు రానివ్వకు.. బయటకు వస్తే కావ్య జీవితం ఏమౌతుందో తెలుసా.. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని చెప్తుంది. అప్పూ నిశ్శబ్దంగా ఉండిపోతుంది. అప్పుడే కళ్యాణ్ కాల్ వస్తుంది. కానీ అప్పు కట్ చేసి పక్కకు పడేస్తుంది.
కంగారు పడుతూ కావ్య కోసం వెతుకుతున్న రాజ్:
ఇక రాజ్ తన గదిలో ఉండి.. మేడమ్ గారు ఇంకా రాలేదు.. ఇంకా పండగ అయినట్లు లేదు.. అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటుంది అని వాష్ రూమ్ కి వెళ్తాడు. వచ్చి చూస్తే ఇంకా కావ్య కనిపించదు. టైమ్ 11 అయింది ఇంకా లేదు. కింద ఏం చేస్తుంది అని కిందకు వెళ్లి చూస్తాడు. కింద ధాన్య లక్ష్మి ఉంటే వెళ్లి అడుగుతాడు.. లేదని చెప్తుంది. తను నాక్కూడా కనిపించలేదు రాజ్.. తాతయ్య వాళ్లతో ముచ్చట్లు పెడుతుందోమో అని అంటుంది ధాన్య లక్ష్మి. సీతా రామయ్య గదిలోకి వెళ్లి కావ్య గురించి అడుగుతాడు. వాళ్లు లేదని చెప్తారు. దీంతో రాజ్ కంగారు పడుతూ ఉంటాడు. ఈ రోజుతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగుస్తుంది. సోమవారం ఎపిసోడ్ తో మళ్లీ కలుద్దాం.