Keerthy Suresh : వెనక్కి తగ్గేది లేదంటోన్న ‘మహానటి’
తెలుగు జనాలు కీర్తి సురేష్‌ను మర్చిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే..మహానటి సావిత్రి పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసి తెలుగువారి గుండెల్లో పర్మనెంట్ ప్లేసు సంపాదించుకుంది ఈ హీరోయిన్.
Keerthy Suresh : తెలుగు జనాలు కీర్తి సురేష్‌ను మర్చిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే..మహానటి సావిత్రి పాత్రకు ప్రాణ ప్రతిష్ఠ చేసి తెలుగువారి గుండెల్లో పర్మనెంట్ ప్లేసు సంపాదించుకుంది ఈ హీరోయిన్. అందుకు తగ్గట్టుగానే వివాదాలకు దూరంగా ఉంటూ, సెట్స్‌లో మంచి ప్రవర్తను కలిగి ఉండి..సావిత్రి, సౌందర్య, అనుష్కల తర్వాత అంత మంచి అమ్మాయిగా ప్రశంసలు అందుకుంటోంది. కీర్తి సురేష్ తెలుగులో ‘మహానటి’ తర్వాత చేస్తోన్న చిత్రం ‘మిస్ ఇండియా’. ఇంతలా అభిమానిస్తోన్న తెలుగు ప్రజలను డిసప్పాయింట్ చేయకూడదని..చాలా వెయిట్ చేసి మరీ ఈ చిత్రంలో నటిస్తోంది ఈ ముద్దు గుమ్మ. తమిళంలో అడపా, దడపా సినిమాలు చేసినా..తెలుగులో మాత్రం పెద్ద ఆఫర్స్‌ని కూడా రిజెక్ట్ చెయ్యడానికి అదే కారణం.
తాజాగా ‘మిస్ ఇండియా’ మూవీ విడుదలకు ముహుర్తం దగ్గర పడుతోంది. ఏప్రిల్ 17న ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అదే సమయంలో నాని ‘టక్ జగదీష్’ తో వస్తున్నాడు. శర్వానంద్ ‘శ్రీకారం’, అఖిల్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’, రామ్ ‘రెడ్’ అంటూ ఏప్రిల్‌లో రిలీజ్‌లకు రెడీ అయిపోయారు. ఇంతమంది యంగ్ హీరోలు దండయాత్ర చేస్తోన్నా మహానటి వెనక్కి తగ్గడం లేదు. రేస్‌కి రెడీ అంటూ లైన్‌లోకి వచ్చేసింది. మరి కీర్తి ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘మిస్ ఇండియా’ ఎంతవరకు మెస్మరైజ్ చేస్తోందో చూడాలి. నదియా, రాజేంద్రప్రసాద్, నరేష్, కమల్ కామరాజు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, నందమూరి హీరోల పీఆర్వో మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా హిట్ పడితే..ఆమె నితిన్‌తో చేస్తోన్న ‘రంగ్ దే’ మూవీకి మంచి ప్లస్‌గా అవుతోంది.